* ప్రసిద్ధులైన వారి విల్లులకు గల విశేషనామాలు
మనం విల్లు పట్టిన వారిని చాలమందిని చూస్తున్నాము. వారిలో మనకు శ్రీరామచంద్రుడు బాగా తెలుసు. తరువాత అర్జునుడు వీరిని గురించి చదువుతున్నాము. కాని విల్లు పట్టునవారిలో ప్రసిద్ధులైన వారి విల్లులకు
గల విశేషనామాలను ఇక్కడ గమనిద్దాము.
#పేరు ------------------ #విల్లుపేరు
#శివుడు --------------- పినాకము
#విష్ణువు --------------- శార్ఙ్గము
#రాముడు ------------- వజ్రకము
#అర్జునుడు ------------ గాండీవము
#ద్రోణాచార్యుడు -------- ద్రుణము
#కర్ణుడు --------------- కాలపృష్ఠము
ఇందులో అర్జునునికి ధనస్సుపేరుతో ఏకంగా గాండీవి అనే పేరుంది.
ధనుర్విద్యలో కృతయుగంలో శివుడు గొప్పవాడు కుమాస్వామికి, పరశురామునికి మొదట నేర్పించారు. పరశురాముడు ద్రోణునికి ద్రోణుడు అర్జునునికి విలువిద్య నేర్పించారు