YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు దేశీయం

రోజుకు రూ.400తో ఏకంగా కోటి రూపాయలు!

రోజుకు రూ.400తో ఏకంగా కోటి రూపాయలు!

రోజుకు రూ.400తో ఏకంగా కోటి రూపాయలు!
న్యూడిల్లీ, డిసెంబర్ 3
డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయడం కూడా విధానం. ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, గోల్డ్ ఇలా పలు రకాల ఆప్షన్లు ఉన్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్‌ కూడా ఇందులో ఒక భాగమే.పోస్టాఫీస్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పూర్తి రక్షణ పొందొచ్చు. కచ్చితమైన రాబడి కోరుకునే చిన్న ఇన్వెస్టర్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ అనువుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. పోస్టాఫీస్‌లో దాదాపు 9 రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ అవసరం, ఇన్వెస్ట్ చేయగలిగే కాలం వంటి పలు అంశాల ప్రాతిపదికన మీకు నచ్చిన స్కీమ్‌లో డబ్బులు పెట్టొచ్చు. స్కీమ్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.పోస్టాఫీస్‌లో తొమ్మిది రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర అకౌంట్, సుకన్య సమృద్ది అకౌంట్‌ అనేవి తొమ్మిది రకాల స్కీమ్స్. వీటిల్లో మీకు నచ్చిన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ర్ఘకాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా కోటి రూపాయలు సంపాదించాలని భావిస్తే.. మీరు ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్ అకౌంట్ వంటి స్కీమ్స్‌ను ఎంచుకోవడం మంచిది. పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు.పీపీఎఫ్ అకౌంట్‌లో రోజుకు రూ.300 ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకోండి. అంటే సంవత్సరంలో మీరు రూ.1,09,500 ఇన్వెస్ట్ చేయగలరు. పీపీఎఫ్ స్కీమ్‌లో ఒక ఏడాది గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాపై 7.9 శాతం వడ్డీ లభిస్తోంది. సంవత్సరం చొప్పున వడ్డీ మొత్తం మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది. ఈ లెక్కన చూస్తే మీరు 26.8 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే రూ.కోటి పొందొచ్చు.అదే మీరు రోజుకు రూ.300 కాకుండా రూ.400 ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే అప్పుడు మీరు ఏడాదిలో చేసే ఇన్వెస్ట్‌మెంట్ మ మొత్తం రూ.1,46,000 అవుతుంది. ఇక్కడ కూడా 7.9 శాతం వార్షిక వడ్డీని లెక్కలోకి తీసుకున్నాం. ఇలా అయితే మీరు 23.5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అప్పుడు మీకు కోటి రూపాయలు వస్తాయి. ఇక్కడ మీరు డబ్బులను 25 ఏళ్ల తర్వాతనే తీసుకోగలరు.3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్ల సవరఇకపోతే స్మాల్ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ వస్తుంది. పోస్టాఫీస్ స్కీమ్స్‌కు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను త్రైమాసికం చొప్పున సవరిస్తూ వస్తుంది. ఇలాంటప్పుడు వడ్డీ రేటు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకునే వారు ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు.పన్ను ప్రయోజనాపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈఈఈ బెనిఫిట్ ఉంది. అంటే పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం, దీనిపై వడ్డీ వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ కాలంలో విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పూర్తి పన్ను మినహాయింపు ఉంది.

Related Posts