YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

హనుమంతుడనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలం పూర్తిగా చదవాల్సిందే.

హనుమంతుడనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలం పూర్తిగా చదవాల్సిందే.

హనుమంతుడనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే???? పూర్తిగా చదవాల్సిందే.
.
అంజనేయుడి తల్లి అంజన, లేక అంజని. తండ్రి కేసరి. అంజన పూర్వాశ్రమంలో అంజికస్థల అనే అప్సరస. కేసరి అపరిమిత బల సంపన్నుడు. అంజన కేసరి దంపతులు మాల్యవంతం పర్వతంమీద జీవించేవారు. ఈ ప్రాంతంలో శంబసాధనుడనే రాక్షసుడు బుుషుల యజ్ఞయాగాదులను పాడుచేసేదే కాకుండా వారిని హింసించేవాడు. దేవతలను కూడా చీకాకుపరిచేవాడు. మునుల కోరికమేరకు కేసరి అసమాన ప్రతిభ కనబరచి శంబసాధనుడిని హతమారుస్తాడు.దేవతలు బుుషులు సంతోషించారు. ఎంతటి బలసంపదులున్నా, అధికారమున్నప్పటికి ఆ ఇంట సంతానం లేకపోతే  నశ్శాంతి,ఆనందం ఉండదు కదా! అంజని కేసరి దంపతులకు కూడా సంతానంలేదు.సంతానానికై కేసరి తపస్సుచేశాడు.వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో ఉంచి కేసరికి ఇచ్చాడు.ఆ అన్యోన్యదంపతుల ముద్దుబిడ్డే అంజనేయుడు. అంజని సుతుడు కనుక అంజనేయుడని, వాయుదేవుని వరప్రసాదంగా పుట్టాడు కనుక వాయుసుతుడని, మారుతి అని, కేసరికొడుకు కనుక కేసరి నందనుడని పేర్లు కలిగాయి. అంజనేయుడు పుట్టుకతోనే దివ్య తేజస్సుతోనూ, అంతులేని బలసంపదలతోనూ పుట్టాడు. ఒకరోజు సూర్యో దయానికంటే ముందుగా అంజన నిద్రపోతున్న అంజనేయుడిని ఇంటిలో వదలి పండ్లు తేవటానికి అడవికి వెళుతుంది. నిద్రలేచిన అంజనేయుడికి ఆకలేస్తుంది. అమ్మ కనబడలేదు. ఇంటిబయటకు వచ్చాడు.  అపుడే ఉదయిస్తున్న ఎర్రని సూర్యబింబాన్ని చూచాడు.బాలుడు కదా ! అతనికి సూర్యుడు ఎర్రని పండులా కనబడ్డాడు. ఆ రోజు సూర్యగ్రహణం కూడా. బాల్యచాపల్యంతో ఆ ఎర్రనిపండుని తినాలని ఆకాశంలోకి ఎగిరాడు. సూర్యతాపం ఎంతటివారినైనా కాల్చివేస్తుంది.అందుకే వాయుదేవుడు చల్లటిగాలిని అంజనేయుడి చుట్టూ ఏర్పరిచాడు.ఆ రోజులలోనే చల్లని ఎయిర్ కండిషన్ ఉందన్నమాట. మనోవేగంతో అమితతేజస్సుతో వస్తున్న అంజనేయుడిని చూచి సూర్యభగవానుడు ఇతనేవరో భవిష్యత్తులో గొప్పవాడిగా మారుతాడని భావించి తన ప్రచండతపాన్ని కొద్దిగా ఉపసంహరించుకొన్నాడు. సూర్యగ్రహణ సమయం కాబట్టి రాహువు సూర్యుని వద్దకు వెళుతున్నాడు. అలా వెళుతున్న రాహువుకు దివ్యతేజస్సుతో సూర్యుడి వైపు వెళుతున్న బాలుడు కనబడ్డాడు. అతని వేగాన్ని అతనిచుట్టూ ఆవరించివున్న శక్తిమంతమైన కాంతిపుంజాలను చూచి రాహువు భయపడ్డాడు. ఆ బాలుడు తనకు పోటీగా వస్తున్నాడని భావించి పరుగున పోయి ఈ విషయం ఇంద్రుడికి చెప్పాడు. వెంటనే ఇంద్రుడు ఐరావతానేక్కి అంజనేయుడి మార్గానికి అడ్డువస్తాడు. తెల్లని ఐరావతాన్ని చూచిన అంజనేయుడు దానిని కూడా ఒక పండులా భావించి పట్టుకోటానికి వచ్చాడు.దేవతల వద్దనున్న శక్తివంతమైన ఆయుధాలలో వజ్రాయుధం ఒక్కటి.వజ్రాయుధం దెబ్బకి ఎంతటి మహబలవంతుడైనా దెబ్బతినక తప్పదు.* ఇంద్రుడు ఆ బాలుడిపైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం తిన్నగా వెళ్ళి అంజనేయుడి ఎడమ దవడకు తగిలింది. దాని దెబ్బకు బాలుడు మార్ఛపోయి కిందపడ్డాడు. ఎడమ దవడ వంకరైంది. తన వరప్రసాదంతో పుట్టిన బాలుడు కిందపడిపోవడం చూచి, వాయుదేవునకు కోపంవచ్చింది. ఆ కోపంతో గాలిని స్తంభింపచేశాడు.వాయుదేవుడు ఇలా గాలిని ఉపసంహరించుకోగానే దేవమానవులు ఇబ్బందులు పడ్డారు. గాలిలేని బాధను తట్టుకోలేక రందరు తరుణోపాయం కొరకు బ్రహ్మదేవుని ఆశ్రయించారు.సమస్య పరిష్కారం కొరకు, బ్రహ్మదేవుడు అంజనికేసరి ల వద్దకువచ్చాడు. గాయపడిన హనుమను ఒడిలో పెట్టుకొని అంజన :ఖసముద్రంలో మునిగిపోయివుంది. ఆ సమయంలో అష్టదిక్పాలకులలో ఒకడైన వాయుదేవుడు అక్కడికి వచ్చి బ్రహ్మదేవునికి పాదాభివందనం చేశాడు.బ్రహ్మదేవుడు సంతోషపడి, గాయపడ్డ అంజనేయుడి ఎడమ దవడను చేతితో నిమిరాడు. అంజనేయుడి గాయాలు సమసిపోయాయి.అంతేగాక ఇంతకు ముందుకన్నా ఎక్కువకాంతితో ఆ దేహం మెరిసింది. భవిష్యత్తులో మంచిపనులు చేసేటందుకుగాను అంజనేయుడికి వరాలు ఇవ్వాల్సిందిగా వాయుదేవుడు దేవతలను కోరాడు. బ్రహ్మదేవుడు అంజనేయుడికి చిరాయువునిచ్చాడు.బ్రహ్మస్త్రం అంజనేయుడిని ఏమి చేయలేదని, కామరూపంతో సూక్ష్మరూపం విద్యను వరంగా ఇచ్చి అంజనేయుడిని ఎవరు స్మరిస్తారో వారికి భయం కలుగదనే వరాన్ని కూడా ఇచ్చాడు.సూర్యభగవానుడు తన తేజస్ శక్తిని కొంచెమిచ్చాడు. అంజనేయుడిని సకల విద్యాపారంగతుని చేస్తానన్నాడు.వరుణుడు నీటివలన మరణం లేదని వరమిచ్చాడు.తన పాశం అంజనేయుడిని ఏమిచేయలేదని ఇతనికి మృత్యువనేది రాదని వరాలిచ్చాడు.వజ్రాయుధం అంజనేయుడిని ఏమి చేయలేదని ఇంద్రుడు దీవించాడు.అలాగే కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మలు మొదలైన దేవతలు కూడా అనేకవరాలను ప్రసాదించారు.ఇలా అంజనేయుడు అనేక వరాలనుపొంది రామాత్ముడై పూర్వరామాయణంలో ఉత్తరరామాయణంలో ఉత్తమభూమిక పోషించి చరితార్థుడైనాడు.హనుమ అంటే దవడ అని అర్థం. దవడగాయపడింది కాబట్టి హనుమ అయినాడు.
భగవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు, బుద్ధిమంతుడు వగైరా పదాలలోని వంతుడు అనే మాటకు కలిగివున్నాడు అనే అర్థం.గాయపడిన హనుమ కలిగివున్నాడు కాబట్టి నుమంతుడైనాడు.
*( అద్భుతశక్తివంతమైన ఆయుధాలు బ్రహ్మస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతం, ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం, రామబాణం, వారుణాస్త్రం మొదలైనవి. వజ్రాయుధ దాటికి ప్రాణాలు కోల్పోనివారిలో అంజనేయుడు, గరు:త్మంతుడు ఉన్నారు.)

 

Related Posts