కలకలం రేపుతున్న మావోయిస్టు కరపత్రాలు
వరంగల్
వరుస మావోయిస్టు కర పత్రాలతో ఏజెన్సీ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అడవిలోఉన్న బారి వృక్షాలను నరికి రోడ్లపై వేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. ప్రభుత్వ భవనాలు కూల్చివేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్టలతో పాటు, ఆంధ్రా - ఒడిశా సరిహద్దులు, తెలంగాణ రాష్ట్రం లో ఏటూర్ నగరం, ములుగు, ఏజెన్సీ ప్రాంతాలు, మావోయిస్టు పార్టీ ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) వారోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు. పీఎల్‌జీఏ స్థాపించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వా రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అం దుకున్న ఇంటెలిజెన్స్ విభాగం పోలీస్ యం త్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇందులో భాగం గా ఆంధ్రా - ఒడిశాలో పోలీసు బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గిరి జన ప్రాంతంలోకి ప్రజాప్రతినిధులను వెళ్లరాదని ఇప్పటికే వారికి పోలీసులు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గస్తీ నిర్వహి స్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామీణ పల్లెలను జల్లెడ పడుతున్నారు.