YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

జై శ్రీమన్నారాయణ

 జై శ్రీమన్నారాయణ

 జై శ్రీమన్నారాయణ 
వేణుం క‌రే కంక‌ణం!
శ్రీకృష్ణుడు పలు రకాల వ్యక్తిత్వాలు కలబోసిన రూపం. ఆయనలో చిలిపి పనులు చేసే చిన్నారి ఉన్నాడు. మగువల మనసు దోచిన గోపికా మానస చోరుడు ఉన్నాడు. అందరికీ ప్రేమను పంచిన ప్రేమమూర్తి ఉన్నాడు. వేణు నాదంతో అందరినీ సమ్మోహితులను చేయగల వేణుగాన విశారదుడున్నాడు. దుష్టులను దునుమాడిన వీరుడు ఉన్నాడు. పీడిత తాడిత జనులను ఉద్ధరించిన విప్లవ మూర్తి ఉన్నాడు. భక్తులను కాపాడిన రక్షకుడున్నాడు. రాయబారిగా దౌత్యనీతి ఎలా ఉండాలో చూపిన రాజనీతివేత్త ఉన్నాడు. యుద్ధరంగంలో సారథిగా యోధుని మనసెరిగి మసిలిన నిపుణుడు ఉన్నాడు. ధర్మం పక్షాన నిలిచిన ధర్మ పక్షపాతి ఉన్నాడు, మానవాళికి మార్గ మార్గ నిర్దేశ‌నం చేసి న జగద్గురువు ఉన్నాడు. ఇంకా ఎన్నో విధాల వ్యవహరించిన ప్రజ్ఞాశాలి ఉన్నాడు. కృష్ణుని రూపం చాలా మందికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే వల్లభా చార్యుడు ఆయనను తన మనోనేత్రంతో దర్శించి
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం….
అంటూ ఇంకా ఎన్నో విధాల ఆ మధురా మృతాన్ని గ్రోలమని మనకు మధురాష్టకాన్ని అందించారు.
కృష్ణుని పెదిమలు, ఆయన ముఖం, కనులు, చిరునవ్వు, హృదయం, నడక ఆయనలో అన్నీ మధురమేనని వర్ణించారు. ఇటువంటి మధురాధిపతి చేతిలో మనకు ఎక్కువగా కనిపించేది మధుర స్వరాలను పలికించి ఆబాలగోపాలాన్ని అలరించిన వేణువు, తలపై ఉండే నెమలి పింఛం. ఆయన వేణుగానం సమ్మోహనకరం. గోపికలే కాదు విన్న పశుపక్ష్యాదులు కూడా ఆ వేణు నాదానికి మంత్రముగ్ధమైపోయేవి. ఈ వేణువు, నెమలి పింఛం శ్రీకృష్ణుని తాత్త్వికతకు చిహ్నమని భావిం చవచ్చు. వీటిని గురించి మహ నీయులు వేరు వేరు అభిప్రా యాలను వ్యక్తం చేశారు.కృష్ణుని వేణు వును కొందరు హృదయానికి సంకేతంగా పేర్కొంటారు. వేణువు ఖాళీగా ఉంటుంది. అలాగే మన హృదయాన్ని ఖాళీ చేసి పరమాత్మ సంబంధమైన ప్రేమ అనే గానంతో నింపితే పరమాత్మను పొందవచ్చనే దానికి అది సంకేతమని వారు పేర్కొంటారు.కృష్ణుని వేణువులోని మర్మాన్ని మరొక మహనీయుడు చమత్కార కథా రూపంలో వివరించారు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు తన ఇంటి వద్ద్ద ఉన్న పూల తోట లోకి వెళ్ళి అన్ని మొక్కలను పలకరించేవాడు. ఒక రోజు ఆయన పూల తోటలోనికి వెళ్లి మొక్కలను అడిగేరట నా కోసం ఏమైనా చేయగలవారు ఎవరున్నారని. వెంటనే వెదురు మొక్క నేను ఏదైనా చేస్తాను అంది. అయితే నీ ప్రాణం పోయినా పర్వాలేదా అని అడిగాడు. పరవాలేదండి. అంతే ఆ వెదురును నరికి దానిని వేణువుగా తయారు చేసి నిరంతరమూ తన చేతిలో ఉంచుకునేవాడు. అంటే తన సర్వస్వాన్ని పర మాత్మకు అర్పించిన వాడిని దేవుడు తన వెంటే ఉంచుకుంటాడు అంటే సామీప్య ముక్తి ఇస్తాడని ఆయన ఆ కథ ద్వారా పేర్కొన్నారు. ఆ వేణువుకు ఆయన ‘మధురమైన అధరాన్ని’ స్పృశించే భాగ్యం కూడా కలిగింది.వేణువుకు సంబంధించి అందులోని తాత్వ్తికతకు మరో అందమైన కథను మరికొందరు జోడించారు. ఒకసారి గోపికలకు వేణువు పై ఈర్ష్య కలిగింది. కృష్ణుడు తమతో కొంతసేపే ఉంటాడు. ఆ వేణువును ఎప్పుడూ వెంట పెట్టుకుని ఉంటాడు. ఆయనకు అది అంత ప్రేమప్రదమైనది కావడానికి గల కారణమేమిటని వారు యోచించారు. వారికి అంతుపట్టలేదు. ఆ రహస్యమేమిటో కృష్ణుని వేణువునే అడిగారు. దానికి వేణువు ఈ విధంగా సమాధాన మిచ్చింది. నాలో అహం అనేది ఏమీ ఉండదు. కృష్ణుడు ఎక్కడకు తీసికెళితే అక్కడకు వెళతాను, ఎటు తిప్పితే అటు తిరుగుతాను, ఎప్పుడు పాట పాడదలచుకున్నా అడ్డ్డు చెప్పను.ఆయన ఏమి చేయమంటే అది చేస్తాను. ఎక్కడ ఉండ మంటే అక్కడ ఉంటాను. ఈ విధంగా ఉంటాను కనుకనే ఆయన నన్ను వెంటబెెట్ట్టుకుని ఉంటాడు అని చెప్పిం ది. అంటే సర్వస్య శరణాగతి అన్న వారిని ఆయన విడువకుండా అక్కున చేర్చు కుంటాడని దీని అర్థం.నెమలి పింఛం విష యా నికి వస్తే అది ఆయనపై ఉన్న పెద్ద్ద ఆరోపణకు కూడా జవాబు చెబుతుంది. నెమలి పింఛం ఆయన అస్ఖలిత బ్రహ్మ చర్యా నికి సంకేతం. దాదా పుగా మొత్తం జంతు జాలంలో ఒక్క నెమలి స్త్రీ సంగమం లేకుండా సంతానానికి జన్మనిస్తుంది. ఒక సమయంలో మగ నెమలి కంటి నుంచి కారిన కన్నీటి బిందువులను తాగడం ద్వారా ఆడనెమలి పిల్లలకు జన్మనిస్తుంది. మగ నెమలి అశ్రుబిందువులలోనే సంతాన కారక కణాలుంటాయని చెబుతారు. కృష్ణుడు తాను అస్ఖలిత బ్రహ్మచారినని తెలపడానికి ఆ పింఛాన్ని ధరిస్తాడని పండితుల అభి ప్రాయం. అయితే అష్ట భార్యలతో పాటు ఎందరో రాచకన్యలను వివాహం చేసుకున్న‌ శ్రీకృష్ణుడు అస్ఖలి త బ్రహ్మచారి ఎలా అయ్యాడనే అనుమానం కలుగుతుంది. ఇక్కడే కృష్ణుడి అసలు తత్త్వాన్ని గ్రహించాలి. ఆయన యోగీశ్వరుడు, బ్రహ్మ జ్ఞాని. శరీరం వేరు ఆత్మ వేరు అనే భావన కలవాడు. కనుక ఇవన్నీ ఆయనకు అంటవని భావించాలి. భాగవతంలో ఆయనను అస్ఖలిత బ్రహ్మచారిగా పేర్కొన్నారు. అంతేకాదు కృష్ణుడు సాక్షాత్తు పర మాత్మే, ఎన్నో రూపాలు ధరించే శక్తిగల మహిమాన్వితుడు. ఆయన ఏ కర్మల ఫలం అంటనివాడు. మృత శిశువుగా పుట్ట్టిన పరీక్షిత్తును బతికించే సమయంలో కృష్ణుడు ఎన్నో ఒట్టులు పెట్టాడని, వాటిలో ‘నేనే కనుక అస్ఖలిత బ్రహ్మచారినైతే ఈ శిశువు బతకాలని’ ఒట్టు పెట్ట్టాడని, పరీక్షిత్తు బతికాడని, కనుక ఆయన అస్ఖలిత బ్రహ్మచారేనని ఒక పండితుని అభి ప్రాయం. ఇక నెమలి పింఛంలోని కన్నులను అందానికి, జ్ఞానానికి ప్రతీ కగా భావించే సంప్రదాయం ఉం ది. మొదటిది దాని రంగు, మెరుపు చూడ ముచ్చటగా ఉంటాయి కనుక దానిని అందానికి ప్రతిరూపంగా భావిస్తూ వచ్చారు. ఇక అది కన్ను రూపంలో ఉండడం వల్ల జ్ఞానానికి సంకేత మయింది. కన్ను వల్ల్లనే ఈ ప్రపంచాన్ని చూడగలం, తద్వారా జ్ఞానాన్ని పొందగలం కనుక దానిని జ్ఞానానికి ప్రతీకగా భావించారు. ఈ రెండూ కూడా కృష్ణ విభూతుల్లో భాగం కావడం మరో విశే

Related Posts