YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు

గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు

గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు
అమరావతి డిసెంబర్ 03  
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను  టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు గద్దె రామ్మోహన్, మద్దాల గిరి, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య తదితరులు మంగళవారం కలిశారు. అమరావతి పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. తరువాత టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. రాజధాని పై సీఎం, అతని మంత్రులు 6 నెలలుగా అవాస్తవాలు చెప్తూ వచ్చారు. ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందని చాటేందుకే అమరావతిలో చంద్రబాబు పర్యటించారు.  ముందస్తు సమాచారం పోలీసులకు ఉన్నా వైసీపీ రౌడీలు దాడికి దిగారని ఆరోపించారు. పోలీసుల కుట్రతోనే చంద్రబాబు పై దాడి జరిగింది. బయట నుంచి తీసుకొచ్చిన లతోనే వైసీపీ దాడి చేయించింది.పోలీసులు ఉసిగొలపటం వల్లే చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశామని అయన వివరించారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజధాని మహిళను అరెస్టు చేసి అన్ని పోలీస్ స్టేషన్ లు తిప్పుతున్నారు. బాధ చెప్పుకున్న మహిళను అరెస్టు చేయడం దారుణమని అయన అన్నారు. అసభ్య పదజాలం వాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదు. చంద్రబాబు పర్యటన లో వాడిన బస్సులను సీజ్ చేసి డ్రైవర్ కండక్టర్ లను అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని అయన విమర్శించారు. కక్ష సాధింపే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు.  గవర్నర్ వాస్తవాలు గ్రహించారు, మా ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించారు. పోలీసులకు తగు ఆదేశాలు ఇస్తానని స్పష్టం చేశారని అయన వెల్లడించారు. 

Related Posts