YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

దివ్యాంగులకు అండగా తెరాస సర్కార్

దివ్యాంగులకు అండగా తెరాస సర్కార్

దివ్యాంగులకు అండగా తెరాస సర్కార్
వనపర్తి డిసెంబర్ 03,  
వనపర్తి దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.మంత్రి మాట్లాడుతూ దేశంలో దివ్యాంగులకు రూ.3016 పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ.  దివ్యాంగులకు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది. వారికి సంబంధించిన ఏ పని కూడా ఆటంకంకలిగి ఆగొద్దన్నది ముఖ్యమంత్రి కేసీఆర్  ఆలోచన అని అన్నారు.  వైకల్యం కోరి తెచ్చుకునేది కాదు .. జన్యు పరమైన, వ్యాధుల మూలంగా వస్తుంది.  వైకల్యం జీవితం ఎదుగుదలకు ఆటంకం కాదని నిత్యం నిరూపించేవారు దివ్యాంగులు.  అంధులకు మనోనేత్రం ఎక్కువగా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే వారు చురుకుగా ఉంటారు.  అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు బుద్దితో వ్యవహరించకపోతే వారు నిజమైన వికలాంగుల కింద లెక్క అని అయన అన్నారు.  వైకల్యం ఏ రూపంలో ఉన్నా సమాజం గురించి, మనుషుల గురించి, మన పరిసరాల గురించి ఆలోచించి అడుగులు వేసేవాళ్లే నిజమైనటువంటి వాళ్లు.  మీకు సంబంధించి జీవితంలో మొదలుపెట్టిన కార్యక్రమాన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. 
 మీకు కేసీఆర్  సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.  దివ్యాంగులకు నా సొంత డబ్బులు అందజేసి ఎంతోమందికి త్రిచక్రవాహనాలు సమకూర్చాను.  భవిష్యత్ లో కూడా నా సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి అన్నారు.

Related Posts