వికలాంగుల శక్తి సామర్ధ్యాలను వెలికి తీయాలి
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
కౌతాళం డిసెంబర్ 03,
వికలాంగులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అభివృద్ధి ముందుకు సాగుతోంది అని వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైస్కూలు ఆట స్థలంలో సెక్రెడ్ ,ఆర్ డి టి అద్వర్యం లో అంతర్జాతీయ విభిన్న వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిలుగ ప్రదీప్ రెడ్డి, దేశాయి కృష్ణ హాజరయ్యారు. వికలాంగుల సభ్యులు రామన్న ఇరన్న వారికి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.వికలాంగులు అభివృద్ధి కి సహకరించలని,అడ్డపేర్లు లేకుండా ఉన్న పేర్లు పిలవలని వికలాంగులకు గౌరవం ఇవ్వాలని,2016హక్కులు చట్టాన్ని అమలు చేయాలని అధ్యక్షుడు రామన్న ర్యాలీ లో నినాదాలు చేశారు. అనంతరం వికలాంగులకు ఆటపోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్రేయ గౌడ్, ఏకాంబ రెడ్డి, అవతారం,హైస్కూలు చైర్మన్ రాముడు, ప్రభుత్వ అధికారులు రమేష్ రెడ్డి, బిమేష్, వైసీపీ నాయకులు ,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.