YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇది ఉన్మాద ప్రభుత్వం

ఇది ఉన్మాద ప్రభుత్వం

ఇది ఉన్మాద ప్రభుత్వం
కర్నూలు డిసెంబర్ 03,  
కర్నూలు జిల్లాలో  రెండోరోజు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగింది. పలు పార్టీ కార్యక్రమాల్లో అయన పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ  లక్ష 50 వేల రూపాయాలు ఫర్నీచర్ తీసుకెళ్లాడాని మాజీ స్పీకర్ ను అవమాన పరిచారు. అవమానం భరించలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యఅని అన్నారు. అమరావతి పర్యటన కు వెళితే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గా నేను అక్కడికి వెళ్తే ఉద్దేశ పూర్వకముగా నాపై చెప్పు లు వేయించారు. వైసీపీ ప్రభుత్వం లో మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు. వీరికి పోర్ట్ పోలియోలు తీసి బుతుల మంత్రులు గా పిలవాలనిఅన్నారు. అన్యాయం గా వివేకానంద రెడ్డి ని చంపేశారు. ఇంటి దొంగలే ఆపని చేశారు. అప్పడు నేను ముఖ్యమంత్రి గా ఉన్నాను కాబట్టి కేసు నీరు గార్చ కుండా విచారణ చేయించాను. 
టీడీపీ లో చురుగ్గా ఉన్నవాళ్ళ పై కక్ష సాధించడం కోసం కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి దారుణంగా చంపడం హేయమైన చర్య అని అన్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఏవిదంగా ఉందొ మనకు అర్థం అవుతుంది. మహిళలు ఎవరు ఇంట్లో నుండి బయటకు రావాలంటే నే భయపడే పరిస్థితి ఉంది. నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఉన్మాద ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని మండిపడ్డారు. కొంత మంది పోలీసులు ఎక్స్ట్రా చేస్తున్నారు మేము రెచ్చిపోతే ఎవరూ తట్టుకోలేరు జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ తో ఆటలు ఆడుతున్నారు జాగ్రత్త అదే మీ పతనానికి దారి తీస్తుంది. ధైర్యం ఉంటే మాతో రాజకీయం గా పోటీ పడండి. మా కంటే ఎక్కువ అభివృద్ధి అన్నారు అది చేసి చూపండని అన్నారు.

Related Posts