YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి స్పష్టం

నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి స్పష్టం

ఉపాధి హామీ పనుల్లో స్త్రీలకు వేతనాల్లో  వివక్షత లేదు


 
నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి స్పష్టం
న్యూఢిల్లీ డిసెంబర్ 03, 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న మహిళల వేతనాల పట్ల ఎలాంటి వివక్షత లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు.  ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న పురుషుల కంటే మహిళలకు వేతనాల చెల్లింపులో తేడాలపై ఎటువంటి ఫిర్యాదులు అందాయని నెల్లూరు ఎంపీ     ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. దీన్ని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి  తోమర్  బదులిస్తూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అవినీతి, నిధుల మళ్లింపు, వేతనాల ఎగవేత, పారదర్శకత లోపాలపై ఎన్నో ఫిర్యాదులు అందాయని తెలిపారు. అయితే వేతనాల చెల్లింపులో మాత్రం తేడా గురించి ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఎక్కువ మంది మహిళలు పాల్గొనేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మహిళలకు పనివేళల్లో సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. వేతనాల్లో ఎటువంటి వివక్షతకు గురి కాకుండా మహిళల కోసం ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో మహిళల నిష్పత్తి 54.57 గా ఉందని పేర్కొన్నారు. దీనిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Related Posts