YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఏసీబీ వలలో మైనింగ్ అధికారి

ఏసీబీ వలలో మైనింగ్ అధికారి

ఏసీబీ వలలో మైనింగ్ అధికారి
నాగర్ కర్నూలు 
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మైనింగ్ క్వారీ అనుమతి కోసం 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ మైనింగ్ ఎ.డి శ్రీనివాసులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లా మైనింగ్ ఎ.డి శ్రీనివాసులు వెల్దండ మండలం లో చెరుకూరు దగ్గర కంకర క్వారీ అనుమతి కోసం ఎం ఓ సి ఇవ్వాల్సిందిగా శంకర్ కొండ తండ కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మైనింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అనుమతి కావాలి అంటే లక్ష రూపాయలు ఇస్తే  పర్మిషన్ ఇస్తానని ఏడి శ్రీనివాసులు చెప్పడంతో నారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్రస్తుతం 20 వేలు ఇవ్వాలని మిగతా డబ్బులు తర్వాత ఇవ్వాలని ఏడి డిమాండ్ చేశారు. గత్యంతరం లేక నారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం  15 వేల రూపాయలు నారాయణ  ఇచ్చి   కార్యాలయానికి పంపారు.  అయితే  ఈరోజు మధ్యాహ్నం 15 వేల రూపాయలు నాగర్ కర్నూల్ ఎడి కార్యాలయంలో   ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ ఇద్దరు ఇన్స్పెక్టర్ల బృందంతో దాడులు చేసి  ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సంఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బుధవారం  ఏసీబీ కోర్టు హైదరాబాదులో రిమాండ్ చేయనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Related Posts