YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మై చాయిస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మంత్రి సబితా

మై చాయిస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మంత్రి సబితా

మై చాయిస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మంత్రి సబితా
హైదరాబాద్ డిసెంబర్ 3
 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మోడల్‌ స్కూల్స్‌ లో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కో-ఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు. వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్న విధానం అద్భుతంగా ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన ఉపాధ్యాయులున్నారనీ, వారు చెబుతున్న పాఠాలు విద్యార్థులు సక్రమంగా వింటే గొప్పవాళ్లవుతారని మంత్రి సూచించారు. తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడాలన్నదే సీఎం కేసీఆర్ కల అని మంత్రి తెలిపారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో అనేక విద్యాలయాలు వెలిశాయని మంత్రి తెలిపారు. అనేక గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మై చాయిస్ మై ఫ్యూచర్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు చదువుతో పాటు సమాజంలో ఏది మంచో, ఏది చెడో కూడా విద్యార్థులకు తెలియజేయాలని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పాటు, విద్యాశాఖ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి, మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణ, విద్యాశాఖ అధికారులు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కో ఆర్డినేటర్లు ఉన్నారు.

Related Posts