సదా అప్రమత్తం
విశాఖపట్నం డిసెంబర్ 3
తూర్పు నావిక దళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నౌకాదినోత్సవం ఏర్పాట్లు పూర్తైయ్యాయి. బుధవారం జరిగే నేవీ డేకి ముఖ్యఅతిధిగా ఏపీ సిఎం జగన్ హాజరవుతున్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ ఎడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ తెలిపారు .సముద్ర మార్గాన దేశంలోకి తీవ్రవాదులు ప్రవేశించే సంకేతాలు ఉన్న నేపద్యంలో భద్రతా ప్రమాణాలను పతిష్టం చేసినట్లు చెప్పారు. పాక్ సహకారంతో దక్షిణ భారతదేశంలోకి తీవ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయని తెలిపారు.వాటని ఎదుర్కోనేలా భద్రతా వళాన్ని పతిష్టం చేశామని తెలిపారు. 2020 మార్చిలో మిలన్ పేరిట నేవీ విన్యాసాలు తూర్పు నౌకాదళం ఆధ్వర్యాన జరగనున్నాయని,దీనికి 41 దేశాలను ఆహ్వానించామని చెప్పారు.హిందూ మహా సముద్రంలో, ఇండో పసిఫిక్ ప్రాంతం ఇపుడు కీలకంగా మారిందని,అయిదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థ కల సాకారం కావాలంటే నౌకా రవాణా సజావుగా సాగేలా కంటెయినర్ కార్గో నౌకలు తయారీని ముమ్మరంగా సాగుతోందని చెప్పారు.చైనా, జపాన్, మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, ధాయిలాండ్ సంయుక్త విన్యాసాలతో పాటుగా ఇప్పుడు అమెరికాతో కలిపి విన్యాసాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.45 యుద్ధనౌకలు తూర్పు తీరాన గస్తీకాస్తున్నాయని అన్నారు.ఏడు జలంతర్గాములు,విమానాలు, హెలికాప్టర్లు కూడా ప్రధాన పాత్రపోషిస్తున్నాయని చెప్పారు.