కొడాలిపై నమోదు చేయండి
విజయవాడ, డిసెంబర్ 3,
వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ.. ఏపీలో ఫిర్యాదుల రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తే.. మంత్రి తమ అధినేత చంద్రబాబుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం టీడీపీ నేతలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో.. మంత్రి నాని టీటీడీ, తిరుమల ఆలయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. డిక్షరేషన్ ఎందుకివ్వాలని ప్రశ్నించడం సరికాదని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపైనా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇలా అసభ్యకరమైన పదజాలం ఉపయోగించినందుకు, బెదిరించినందుకు, కుల మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు.మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. గుంటూరు జిల్లాకు చెందిన మహిళను కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత మహిళను పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు. కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామానికి చెందిన మంగళపూడి ముక్తేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు 41 కింద నోటీసులు జారీ చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. మహిళ గత నెల 26న అమరావతిలో జరిగని ఓ నిరసన కార్యక్రమంలో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి