YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ముచ్చటగా మూడు నెలలే ఎక్సెల్ ప్లాంట్ అనారోగ్యాలతో  ఇబ్బందులు పడుతున్న స్థానికులు

ముచ్చటగా మూడు నెలలే ఎక్సెల్ ప్లాంట్ అనారోగ్యాలతో  ఇబ్బందులు పడుతున్న స్థానికులు

ముచ్చటగా మూడు నెలలే ఎక్సెల్ ప్లాంట్
అనారోగ్యాలతో  ఇబ్బందులు పడుతున్న స్థానికులు
విజయవాడ, డిసెంబర్ 4,
విజయవాడ సింగ్ నగర్ లో చెత్తనుంచి విద్యుత్‌ను తయారు చేసేందుకు ఇక్కడ రూ.25 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అది కేవలం మూడునెలలు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడంతో అదికాస్త అటకెక్కింది. దీంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. ప్రతిరోజూ 500 మెట్రిక్‌ టన్నుల వరకూ చెత్త వచ్చి చేరుతుండడం, చెత్తను రీసైక్లింగ్‌ పేరుతో దానికి నిప్పు పెట్టడం వల్ల దానినుంచి వెలువడే పొగ వల్ల స్థానికులు దగ్గు, ఆయాసం, శ్వాసకోస సంబంధిత రోగాలతో పాటుగా వాంతులు, వీరోచనాల బారిన పడుతున్నారు. ఇక్కడ నివసించే వారంతా నిరుపేదలే కావడంతో వారు సంపాదించిన దానిలో నెలకు దాదాపు ఒక్కో కుటుంబం రూ.3 నుంచి రూ.5 వేల వరకూ ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో గతంలో పలుమార్లు విషజ్వరాలు వ్యాపించాయి. ఆ సమయంలో కూడా కనీసం ఎంఎల్‌ఎ బోండా ఉమా పరామర్శకూ రాలేదని స్థానికులు చెపుతున్నారు. అంతేకాకుండా నగరంలోని కుక్కలను పట్టుకొచ్చి ఇక్కడ వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత వాటిని ఇక్కడే వదిలేశారు. కుక్కలు, పందులు ఇక్కడ చెత్తలో సంచరిస్తూ పరిసరాలను మరింత దారుణంగా మార్చేస్తున్నాయి. ఇక్కడ చెత్తను పాతపాడుకు తరలించేందుకు గతంలో యంత్రాలతో గుట్టలు గుట్టలుగా విడదీసి అలాగే వదిలేశారు. వర్షాలు కురవడం వల్ల ఆ గుట్టల మధ్యలో మురుగునీరు పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయిగార్బెజ్‌ ఇటుకల తయారీ ఫ్యాక్టరీని, జంతువుల ఎముకల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీనికి ఇక్కడ పెట్టేందుకు యత్నిస్తున్నారు. అదే జరిగితే విజయవాడ సింగ్‌నగర్‌వాసులు తీవ్ర రోగాల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇక్కడివారి జీవనాన్ని మరింత దుర్భరంగా మార్చడానికి పాలకులు యత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో గార్బెజ్‌ ఇటుకల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌ పాలకమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే జరిగితే ఇక్కడ మరింత కాలుష్యం పెరిగి ప్రజలు రోగాల బారిన పడతారు. దాంతోపాటుగా జంతువుల ఎముకల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే పరిశ్రమను కూడా ఏర్పాటు చేయాలని యత్నిస్తున్నారు. దీనివల్ల కూడా ప్రజలు రోగాల బారిన పడతారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ 10సార్లు అగ్నిప్రమాదాలు వాటిల్లాయి. చెత్తకు నిప్పుపెట్టడం వల్లే ఈ ప్రమాదాలు వాటిల్లాయి. దీనివల్ల మరింత కాలుష్యం పెరిగి ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. వీటిపై ఇప్పటివరకూ పాలకులు విచారణకు ఆదేశించిన పాపాన పోలేదు. రూ.2 కోట్ల వ్యయంతో మిథనైజేషన్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజీవ్‌గాంధీ హౌల్‌సేల్‌ మార్కెట్‌ను కూడా ఇక్కడకు తరలించాలనే యోచనలో సర్కారు ఉంది. ఈ విధంగా సుమారు రూ.187 కోట్ల విలువైన 32 ఎకరాల ఈ స్థలాన్ని ప్రయివేటు పరం చేయడానికి ప్రభుత్వం యత్తిస్తోంది.దీనికోసం ఇక్కడివారి నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు ఈ విధంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కాలుష్యం కోరల్లో చిక్కుకునేలా చేస్తోందనే వాదన లేకపోలేదు. అంతిమంగా తాము చేసే పని ఏదైనా ప్రజల కోసమే అనే ఆలోచన తీసుకొస్తుందని పలువురు మేధావులు చెబుతున్నారు నగరంలో రోజూ సేకరించిన దాదాపు 500 మెట్రిక్‌ టన్నుల చెత్తను అర్ధరాత్రి సమయంలో సింగ్‌నగర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 3 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగానే చెత్త నిల్వ ఉంది. నాలుగున్నరేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఎంఎల్‌ఎ బోండా ఉమామహేశ్వరరావు ఇక్కడ నుంచి డంపింగ్‌యార్డును తరలిస్తామని హామీనిచ్చారు. తమకు అధికారమిస్తే కొత్తగా ఇక్కడ చెత్తను డంపింగ్‌ చేయకుండా చూసుకుంటామని, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని, దానిలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని హామీకూడా అమలుకు నోచుకోలేదు.

Related Posts