అమ్మాయిలు...హాక్ ఐ వాడుకోండి
సైబారాబాద్, డిసెంబర్ 4,
మహిళల భద్రతకోసం హైదరాబాద్ పోలీసులు దిశానిర్ధేశం చేశారు. ఇందుకు గాను కొన్ని సలహాలను ఇచ్చారు. మహిళలు ఎక్కడికైనా పనిమీద వెళ్తే అయా సమాచారాన్ని కుటుంబసభ్యులకు, దగ్గరివారికి తెలుపాలని సూచిస్తున్నారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్నట్లయితే ఆ క్యాబ్ వివరాలను ఇంట్లో వాళ్లతో పంచుకోవాలి. చేరుకునే గమ్యస్థానాన్నికూడా తెలియజేయాలి. అవసరం అనుకుంటే హైదరాబాద్ పోలీసులకు చెందిన ‘హాక్ ఐ’ మొబైల్ ఆప్ సహాయం తీసుకోవాలని చెప్పారు. పరిస్థితులు అనుమానాస్పదంగా తోస్తే ముందుగా.. దగ్గరలోని జనాలు తిరుగుతున్న ప్లేస్ కు వెళ్లాలని సూచించారు. తక్షణమే 100 కు డైల్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని చెప్పారు. అయితే ఈ సలహాలు మహిళలకే ఎందుకు మగవాళ్లకు ఇలాంటి సలహాలు ఎందుకు ఇవ్వరని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయ పడుతున్నారు.మహిళలు ప్రయాణించేటప్పుడు కుటుంబానికి, దగ్గరి బంధువులకు ఎక్కడికి వెళ్తున్నారో.. ఎంతసేపటికి తిరిగి వస్తారో చెప్పాలి.టాక్సీ లేదా ఆటో నెండర్ ప్లేట్ వివరాలను తెలియచేయాలి తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు రూట్ గురించి తెలుసుకోవాలి. నిర్మానుష్య ప్రదేశాలలో ఉండొద్దని… ఎప్పుడూ రద్ధీగా ఉండే ప్రదేశాలలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎదైనా అనుమానం వస్తే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల సమాయం తీసుకునేందుకు వెనకాడవద్దు మహిళల చుట్టూ జనాలు లేకపోతే… పక్కనే ఉన్న షాపులు, షానింగ్ మాల్ కు దగ్గరగా నిలబడాలి. అనుమానాస్పద పరిస్థితులలో తోటి ప్రయాణికుల సహాయం అడగాలి ధైర్యంగా ఉండాలని ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలని.. గట్టిగా మాట్లాడి ఎదుర్కోవాలి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గట్టిగా అరవాలని.. రద్ధీగా ఉండే ప్రదేశానికి పరుగెత్తాలి
పోలీసులు, ఆపదలో ఉన్నవారు కలిసి నేరాలను నిరోధించేందుకు కృషి చేయాలి. ఏదైనా ఫొటోలను పోలీసులకు పంపాలనుకుంటే 9490616555 లనే నెంబర్ కు వాట్సప్ చేయాలి.