YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

ఆర్టీసీకి సిటీలో తగ్గనున్న నష్టం

ఆర్టీసీకి సిటీలో తగ్గనున్న నష్టం

ఆర్టీసీకి సిటీలో తగ్గనున్న నష్టం
హైద్రాబాద్, డిసెంబర్ 4,
ఆర్టీసీ చార్జీల పెంపు ప్రభావం హైదరాబాద్‌పై భారీగానే పడనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో సగం వాటా సిటీవే ఉంటున్నాయి. ఆ నష్టాలను వీలైనంత మేర తగ్గించేందుకు కసరత్తు మొదలైన తరుణంలో, చార్జీల పెంపు ఆర్టీసీకి బాగానే కలిసి రానుంది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచగా, శాతాల్లో అది 18.80 శాతంగా ఉండనుంది. కానీ సిటీ సర్వీసుల వరకు వచ్చేసరికి అది 23 శాతంగా ఉంటోంది. కిలోమీటర్ల లెక్క కాకుండా సిటీలో స్టాపుల ప్రాతిపదికగా ఛార్జీ ల పెంపు ఉంది. పైగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బ స్సులకు రూ.5గా ఉన్న కనిష్ట ఛార్జీని రూ.20కి పెంచారు. నగరంలో ఉన్న బస్సుల్లో వీటి సం ఖ్యే ఎక్కువగా ఉండటం, ప్రయాణికుల సం ఖ్య కూడా వీటిల్లోనే ఎక్కువగా ఉంటుండటం తో ఈ మార్పు కూడా కలిసి రానుంది.వెరసి.. తాజా రేట్ల సవరణతో సిటీ సర్వీసులకు సం బంధించి వార్షికంగా రూ.324 కోట్ల మేర ఆదా యం వస్తుందని అధికారులు అంచనా. సమ్మె ప్రారంభం కావటానికి ముందు నగరంలో టికె ట్‌ రూపంలో రోజువారీ ఆదాయం సగటున రూ.3.06 కోట్లుగా ఉంది. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించారు. ఇప్పుడు తిరిగి బస్సులు మొ దలైనందున వారంతా  సిటీ బస్సుల్లోనే ఎక్కుతారని అంచనా. ఈ ఆదాయం అలాగే ఉంటే టికెట్ల ధరల సవరణ వల్ల నెలవారీ ఆదాయం రూ.27 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు సిటీలో రూ.45 కోట్ల మేర నష్టం వస్తోంది. తాజాగా సమకూరే అదనపు ఆదాయంతో ఆ నష్టం మొత్తాన్ని రూ.18 కోట్లకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. 

Related Posts