YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

గురుకుల వసతి గృహంలో కలెక్టర్ రాత్రి నిద్ర కడప

గురుకుల వసతి గృహంలో కలెక్టర్ రాత్రి నిద్ర కడప

గురుకుల వసతి గృహంలో కలెక్టర్ రాత్రి నిద్ర
కడప డిసెంబర్ 4,
కడప జిల్లా పులివెందుల సమీపంలోని బెస్తవారిపల్లె వద్దనున్న బాలయోగి గురుకుల బాలుర వసతి గృహంలో మంగళవారం రాత్రి కలెక్టర్ హరికిరణ్ చేసారు. బుధవారం ఉదయం నిద్ర లేవగానే విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వసతి గృహంలోని సమస్యలపై ఆరా తీసారు  వసతి గృహంలో ఫ్యాన్స్, లైట్స్, స్విచ్ బోర్డు లు సరిగా లేవని కలెక్టర్ కు విద్యార్థులు వివరించారు.  ఫ్యాన్లు వెంటనే గురువారం  లోగాఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి, ఈ మేరకు ఫ్యాన్లు ఏర్పాటుకు నేడే చర్యలు తీసుకోవాలని పాడా ఓఎస్ డి కి ఆదేశాలను కలెక్టర్ జారీ చేసారు. వసతి గృహంలోకి కుక్కలు ప్రవేశించి తమ పక్క బట్టలపై పడుకుంటున్నాయని కలెక్టర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. దీనిపై బిబాలయోగి బాలుర గురుకులమ్ (యూజి) ప్రిన్సిపాల్ కె.రామచంద్రన్, కేర్ టేకర్ కె.ప్రభాకర్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్,  కుక్కలు వసతి గృహంలోకి రాకుండా వెంటనే పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.  ఈ గురుకులంలో వసతుల లేమి,  విద్యార్థులు పడుతున్న అవస్థల పై సరైన పర్యవేక్షణ చేయడం లేదని ఫోను ద్వారా  ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీదేవి తో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేసారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలన్నింటిని  దశలవారీగా తప్పనిసరిగా  పరిష్కరించి వసతి గృహము, పాఠశాలను అభివృద్ధి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.  తరువాత వసతి గృహంలోని వంటగది పరిశీలించి అక్కడి కోడిగుడ్లు కందిపప్పు బియ్యం బెల్లం తదితర వస్తువుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్. ఆపై భోజనశాలను పరిశీలించారు. పాడైపోయిన ఆర్ఓ ప్లాంట్ ను పరిశీలించి  వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. పాఠశాల తరగతి గదులలో బెంచీలు పూర్తిగా పాడైపోయి ఉండడాన్ని గమనించి వాటికి మరమ్మతులు చేయించడం గల అవకాశాలు లేదా వాటి స్థానంలో కొత్తవి తెప్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  పాఠశాల లోని వాలీబాల్, త్రో బాల్, ఖోఖో, కబడి ఆడే విద్యార్థులందరూ కలెక్టర్ను కలిసి ప్లే గ్రౌండ్ రాళ్ల తో నిండి కాళ్లకు గుచ్చుకుంటున్నాయి అని ప్లే గ్రౌండ్ ను చదును చేయించి ప్లాస్టింగ్ చేయించాలని కోరారు. ఆట మైదానాన్ని అభివృద్ధి చేయిస్తామని విద్యార్థులకు స్పష్టం చేసారు. ఈ సందర్భంగా వంట మనుషులు, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది గత ఐదు నెలలుగా తమకు జీతాలు అందడం లేదని కలెక్టర్ కు విన్నవించారు.   దీనిపై సంబంధిత ఏజెన్సీ వారితో  మాట్లాడుతామని, వారి సమస్య పరిష్కారానికి తీసుకుంటామని అన్నారు. 

Related Posts