YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పర్యావరణహితంగా పరిశ్రమల ఏర్పాటు

పర్యావరణహితంగా పరిశ్రమల ఏర్పాటు

పర్యావరణహితంగా పరిశ్రమల ఏర్పాటు
హైదరాబాద్ డిసెంబర్ 4, 
మాదాపూర్ శిల్పాకళావేదికలో టీఎస్ఐపాస్ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజన్, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని స్పష్టం చేశారు. పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్ ఒక రోజంతా చర్చించి.. టీఎస్ ఐపాస్కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్ను మారుస్తున్నాం. ఓఆర్ఆర్ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  నాణ్యమైన విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు చెల్లిస్తాం. ఒక పరిశ్రమకు రాయితీ ఇస్తే వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. పరిశ్రమలకు రాయితీలు ఇస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లు అపోహలు సృష్టించారు. చైనాతో పోటీ పడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు మెగా పార్కులు ఉండాలి. హైదరాబాద్ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఫార్మా సిటీ కోసం 10 వేల ఎకరాలు సేకరించాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తల రూ. 305 కోట్ల రాయితీలు అందజేశాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం. మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడాలంటే భారీ ప్రాజెక్టులు ఉండాల్సిందే. నిబద్ధతతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశ్రమల వద్దే ఉద్యోగుల నివాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు

Related Posts