YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
సూర్యాపేట డిసెంబర్ 4, 
సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్ లో మున్సిపాలిటీ కార్యాలయం లో టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమనికు ముఖ్య అతిథిగా హాజరై ఉచిత చేతి సంచుల పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బుధవారం ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ   జర్నలిస్టులు చేస్తున్న ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమానికి మద్దతు చాలా అభినందనీయమని అన్నారు.  ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ పై అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధం చేసే విధంగా అడుగులు వేయాలన్నారు.  పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలి. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య లోపం లేకుండా అన్ని రకాల సమస్యలు తీర్చడం కోసమే నెలరోజుల ప్రణాళికను మొదలు పెట్టామని తెలిపారు.  కవర్ల పై ఆధార పడకుండా ప్రతి ఒక్కరు ఇంటివద్ద నుండి చేతి సంచులతో రావాలని అలా వచ్చినట్లయితే పర్యావరణం కాపాడడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయినట్లేనని అన్నారు. వార్డులలో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది వచ్చి శుభ్రపరచిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా చేసుకునే విధంగా ఉండాలన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకుశ వలి, ఎంపీపీ గూడెం శ్రీను, మాజీ కౌన్సిలర్ జక్కుల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు అమర్నాథరెడ్డి,  టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ రెడ్డి..  ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు క్రాంతి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొంతగాని రమేష్ గౌడ్. కోశాధికారి మధు జిల్లా యూనియన్ ఉపాధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్.. జిల్లా కమిటీ సభ్యులు రఫీ, ఉషశ్రీ, నియోజకవర్గ కమిటీ సభ్యులు లక్ష్మణ్,విశాఖ, బాలు, రహీమ్, వెంకన్న, చంద్రమౌళి,మహేష్, తదితరులు పాల్గొన్నారు

Related Posts