YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హైదరాబాద్ లో వైఎస్ఆర్ మెమోరియల్ కు కాంగ్రెస్ డిమాండ్

హైదరాబాద్ లో వైఎస్ఆర్ మెమోరియల్ కు కాంగ్రెస్ డిమాండ్

హైదరాబాద్ లో వైఎస్ఆర్ మెమోరియల్ కు కాంగ్రెస్ డిమాండ్
హైదరాబాద్ డిసెంబర్ 4
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి  కోసం ప్రపంచ స్థాయి స్మారకాన్ని నిర్మించాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో వై ఎస్ ఆర్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జూలై 2 న తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కోశాధికారి గుడూర్ నారాయణ రెడ్డి తెలిపారు. అయితే గత ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం లో ఎటువంటి చర్యలు తీసుకోలేదని  అన్నారు. 2004-2009 మధ్య వైయస్ రాజశేఖరరెడ్డి పాలన అప్పటి  ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణ యుగం అని అన్ని ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆయన పథకాలతో లబ్ది పొందారని నారాయణరెడ్డి తెలిపారు.ముఖ్యంగా అయన ప్రవేశపెట్టిన .. ఫీజు రీయింబర్స్మెంట్ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఆరోగ్యశ్రీ  మొదలైన అనేక విప్లవాత్మక పథకాలు కోట్లాది మంది పేద ప్రజలకు సహాయపడ్డాయి అని తెలిపారు.  అలాగే వై ఎస్ ఆర్  పాలన పేదలకు అనుకూలమని కెసిఆర్ స్వయంగా పలు సందర్భాల్లో అంగీకరించినందున మాజీ ముఖ్యమంత్రి కి నివాళులు అర్పించడానికి ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన చొరవ తీసుకోవాలి అని నారాయణరెడ్డి  అన్నారు.
రాజశేఖర రెడ్డి జీవితం నుండి భవిష్యత్ తరాలు చాలా నేర్చుకోగలవని వై ఎస్ ఆర్  మెమోరియల్ ఏర్పాటు ప్రతిపాదనను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. జూలై 8 న వై ఎస్ ఆర్  జయంతి సందర్భంగా రాష్ట్ర  ప్రభుత్వం ఈ ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే  వచ్చే ఏడాది పుట్టిన రోజు నాటికి స్మారక చిహ్నం సిద్ధం చేయాలనీ కోరారు. అలాగే హైదరాబాద్ లో  వై ఎస్ ఆర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తే  రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సంబంధాన్ని మెరుగు పరుస్తుందని అయన అన్నారు.
2009 సెప్టెంబరులో వై ఎస్ ఆర్ మరణించిన వెంటనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ గందర గోళం కారణంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. అయితే వై ఎస్ ఆర్  కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సిఎం కెసిఆర్ స్నేహ పూర్వక సంబంధాలు పెట్టు కోవడంతో ఇప్పుడు రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉందని . దీని పై సీఎం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Related Posts