కాంట్రాక్ట్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయానికి రావాలి
నెల్లూరు డిసెంబర్ 4
నెల్లూరు రీజియన్ పరిధిలో తాత్కాలికంగా తొలగించిన కాంట్రాక్టు కండక్టర్లు గురువారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రీజనల్ మేనేజర్ కార్యాలయానికి రావాలని కార్యాలయం నుండి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఎం ఈ సి రీజియన్ లో పని చేసే నిమిత్తం తమ సమ్మతిని తెలియజేసేందుకు నెల్లూరు రీజినల్ మేనేజర్ కార్యాలయం లో నిర్వహించిన సమావేశానికి రావలసిందిగా కోరారు. నెల్లూరు జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి వి రామమ్ పిలుపుమేరకు కాంట్రాక్టు కండక్టర్ లందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు.