YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జిఓ నెంబర్..81 85 రద్దు చెయ్యాలి  ప్రభుత్వ వైఖరి పై నిప్పులు చెరిగిన జమతే ఇస్లాం హింద్  అమరావతి

జిఓ నెంబర్..81 85 రద్దు చెయ్యాలి  ప్రభుత్వ వైఖరి పై నిప్పులు చెరిగిన జమతే ఇస్లాం హింద్  అమరావతి

జిఓ నెంబర్..81 85 రద్దు చెయ్యాలి 
ప్రభుత్వ వైఖరి పై నిప్పులు చెరిగిన జమతే ఇస్లాం హింద్ 
అమరావతి డిసెంబర్ 04
దేశ బాషా లలో తెలుగు లెస్స అన్నారు పెద్దలు కానీ నేడు ఆంధ్రప్రదేశ్ లో వాడుక భాషలు తెలుగు.ఉర్దూ లాంటి బాషా లు కనుమరుగు అయే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి అని జమతే ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం నాడు విజయవాడ లబ్బిపేట లోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  బాషా కనుమరుగైతే మన సంస్కృతి కూడా కనిపించకుండాపోతుంది అన్నారు. గతంలో వై.యస్.రాజశేఖర రెడ్డి ఉర్దూ మీడియం అభివృద్ధికి కృషి చేశారన్నారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భాషను అంతమొందించే విదంగా ముందుకు వెళుతున్నారని రఫీక్ అన్నారు స్కూళ్లలో కనీసం విద్యార్ధిని లకు మౌలిక సదుపాయాలు పై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు జి.ఓ నెం.81, 85 ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని ఆదేశాలు పై ప్రభుత్వం పునర్ ఆలోచించలని కోరారు. ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం విద్య ను ప్రవేశపెట్టడం ద్వారా అరచేతిలోవైకుంఠంచూపుతున్నారన్నారు. ఎవరు ఏ భాషలో చదివితే వారి ఉపాధి అవకాశాలు ఎలా పొందారో ఒక అధ్యయనం ప్రభుత్వం చెయ్యాలి అని డిమాండ్ చేశారుప్రభుత్వంలో ఉన్నస్కూల్ లలో మౌలికసదుపాయాలకల్పనపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులఖాళీలను భర్తీ చేయకుండా,ఉన్నఉపాధ్యాయులకు ఇంగ్లీషులో ప్రావీణ్యం లేకుండా ఏ విదంగా ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం అమలు చేయగలరు అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్కూళ్లలో నిర్బంధముగా ఇంగ్లీషు మీడియంని జిఓ విడుదల చేయటం తప్పు పట్టారు. ప్రాథమికస్ధాయిలో మాతృభాషలో నే విద్యా బోధనచేయాలని చట్టాలు చెబుతున్నా.. ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని అన్నారు. రాజ్యాంగములో 351 ఆర్టికల్ ప్రకారం ప్రాథమికవిద్యను మాతృభాషలో బోధనచేయాలని చెబుతున్నా ప్రభుత్వం వాటిని పెడచెవినపెట్టటం ఎంత వరకు సబబు అన్నారు ప్రభుత్వంఇచ్చే ఆదేశాలు మూలంగా తెలుగు బాషాతో పాటు ఉర్దూ బాషాకూడా అంతరించేప్రమాదంఉందన్నారు.  మాతృభాషప్రాధాన్యతను డా.బి.ఆర్.అంబేద్కర్ తో పాటు కొఠారి కమిషన్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి అని గుర్తు చేశారు.  భారతదేశంలో మాతృభాషలో చదివే వారుఅనేకమంది ఉన్నతస్థాయిలో ఉన్నారు చరిత్ర లో చాలా ఉదాహరణలు ఉన్నాయి అన్నారు. మాతృభాషలో చదివేటప్పుడు విద్యార్థులలో సుజనాత్మకతపెరుగుతుంది అన్నారు. దీనిపై జమతే ఇస్లాం హింద్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జి.ఓ 81,85 లను రద్దు చేయాలని కోరారు. దీనిపై బాషా పండితులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts