YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నలుగురు దోపిడిదారుల ఆరెస్టు హైదరాబాద్

నలుగురు దోపిడిదారుల ఆరెస్టు హైదరాబాద్

నలుగురు దోపిడిదారుల ఆరెస్టు
హైదరాబాద్ డిసెంబర్ 04
హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలో ని షేక్ పెట్ సక్కుబాయి నగర్ కాలనీలో ఈ నెల రెండవ తారీఖున దారి దోపిడిలకు పాల్పడిన నలుగురు యువకులనో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం సేవించి అర్ధరాత్రి రెండు గంటల 30 నిమిషాల తర్వాత ఒంటరిగా వెళ్తున్న వాహనాలపై వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదు సెల్ఫోన్లో దోచుకున్నారు. అదే ప్రాంతంలో పార్కింగ్ చేసే లారీ డ్రైవరును కొట్టి అతని వద్ద నుంచి ఓ సెల్ ఫోను రెండు వేల నగదును గుంజుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. వేరే లారీ డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ నుంచి పారిపోయి మరో ఇద్దరిని వెంట తెచ్చుకొని లారీ డ్రైవర్ ల పై దాడి చేసి వారి వద్ద నగదును దోచుకుని పారిపోయారు. ఈ కేసును గోల్కొండ పోలీసులు 24 గంటల్లో చేధించారు.  నిందితులు హరీష్, వెంకటేష్, సుషిత్,  అభిషేక్ సింగ్, విశాల్ పంగరి, వివేక్ కుమార్ లను అరెస్టు చేసారు.   వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో కూడా నేరాలకు పాల్పడినట్లు ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు గుర్తించిన పోలీసులు వీరిపై పిడియాక్ట్ నమోదు చేయడానికి కోర్టుకు రిఫర్ చేస్తామన్నారు. 

Related Posts