YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్

ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్

ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్
భద్రాద్రి డిసెంబర్ 04
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలంలోని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడంకోసం రాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆడబిడ్డకు 18 ఎళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, షాధీముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహాల కోసం ఒకలక్ష నూట పదహారు  (1,00,116) రూపాయలను వివాహ కానుకగా అందజేస్తుందన్నారు. గతంలోఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని, కేవలం కెసిఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుందని అన్నారు.  సీఎం కేసీఆర్ సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని తెలియజేశారు, రైతు బంధు,రైతు బీమా పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రణాళికలను చేస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్లు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Posts