YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ

యాద్రాద్రి కథనాలపై మండిపాటు

యాద్రాద్రి కథనాలపై మండిపాటు

యాద్రాద్రి కథనాలపై మండిపాటు
 యాదాద్రి భువనగిరి డిసెంబర్ 04
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువు(మూల విరాట్) విగ్రహం పై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు పత్రిక ప్రతులను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. అసలు గర్భాలయంలో ఎంజరుగుతుంది అని బీజేపీ నేతలు, స్థానికులు అంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంమైన  యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులలో భాగంగా యాదాద్రి క్షేత్రం ఎంతో దివ్య క్షేత్రం గా గొప్పగా చెప్పుకొనే విధంగా నిర్మితమౌతుంది కానీ స్వయంభువు గర్భాలయంలో ఎంజారుగుతుందని అందరూ ఆరాతీస్తున్నారు కానీ గుడి ప్రారంభం అవుతేగాని ఎవరికి ఏది తెలియదు. కొంతమంది ఎవరో ఒకరు అన్న విషయాన్ని బయటపెట్టి స్వయంభువుల విగ్రహం మార్చారు అనడం సబాబుకాదు అంటున్నారు ప్రధాన అర్చకుడు నల్లoదీగాళ్ నర్సింహా చార్యులు. స్వయంభువు విగ్రహానికి గత కొన్ని సంవత్సరాలుగా సిందూరం,చందనం పూయడం అభిషేకాలు చేయడం వలన స్వయంభువు నరసింహ స్వామి వారి విగ్రహానికి చీమలు రావడం ఆ ప్రాంతంలో రంధ్రాలు పడడంతో అక్కడ చిట్టి ఎలుకలు, చీమలు స్వైర విహారం చేస్తున్నాయి అందుకని స్వామి వారి పైనున్న సిందూరం మాత్రం తొలగించామన్నారు అదికూడా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ఇవ్వడానికి తప్ప అందులో ఎలాంటి సందేహం లేదు అని ఆలయ ప్రధాన అర్చకులు అన్నారు. హిందూ దేవాలయ సమితి బీజేపీ నేతలు మాత్రం గర్భాలయంలో ఎలాంటి మార్పు చేర్పులు ఉండకూడదు అంటున్నారు వ్యక్తిగతమైన విగ్రహాలు ఫోటోలు ఉండకూడదని అంటున్నారు. ఓ పత్రికలో స్వయంభువు విగ్రహాన్ని ఏంచేశారు ,ఏం మార్పుచేర్పులు చేస్తున్నారు అని వచ్చిన కథానాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు trs నాయకులు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంటే ఆంధ్రా పత్రికలు తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదన్నారు. సంబంధిత పత్రికాయాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని యాదగిగుట్ట ఏసీపీ  కోట్ల. నర్సింహ రెడ్డికి పిర్యాదు చేసారు తెరాస నాయకులు. యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రజలకు తెలియజేయాలని అంతేగాని ఎంతెలియకుండానే ప్రచురించడం సబబు కాదని మండిపడ్డారు.

Related Posts