డిఫెన్స్‌కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం: కేటీఆర్
హైదరాబాద్ డిసెంబర్ 4
నగరంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్ కాంక్లేవ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ ఏరోస్పేస్ అండ్ ఢిపెన్స్‌పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిఫెన్స్‌కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ఇతర రాష్ర్టాలకు తరలిస్తుంది. ఐదేళ్లలో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిసి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కోరినా స్పందన లేదు.రాష్ట్రంలో ప్రయివేటు భాగస్వామ్యంతో ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తాం. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ వృద్ధి చెందుతోంది. బాలానగర్, కుషాయిగూడలో ఏరోస్పేస్, డిఫెన్స్ విడి భాగాల తయారీ కంపెనీలున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు హైవే మార్గంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడం. నాగ్ పూర్, గుజరాత్, చెన్నైలను మాత్రమే కేంద్రం పట్టించుకుంటోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగాల్లో కొన్నింటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించే హెలికాప్టర్‌లో ఉండే క్యాబిన్‌ను కూడా హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన సికార్‌స్కీ విమాన సంస్థ ఆ క్యాబిన్లను మన నగరంలో ఉత్పత్తి చేస్తోందన్నారు. రక్షణ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. పలు అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయన్నారు. ఆదిభట్ల, జీఎంఆర్, అదానీ ఏరోస్పేస్ సెంటర్లు రక్షణ రంగ ఉత్‌ెత్తులకే కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, రఫేల్ లాంటి బహుళజాతి సంస్థలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ సంస్థ కూడా ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేసిందన్నారు. పలు అంతర్జాతీయ రక్షణ సంస్థలు ఇక్కడ తమ ఆర్ అండ్ డీ సెంటర్లను ఏర్పాటు చేశాయన్నారు. భారతీయ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కూడా ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తోందన్నారు. పరిశ్రమలకు కావాల్సిన వర్క్‌ఫోర్స్ తెలంగాణలో పుష్కలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రైవేటు భాగస్వాములతో ఏరోస్పేస్ వర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.