YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలం

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలం

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలం
హైదరాబాద్ డిసెంబర్ 4 
 దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ  ఉత్తర్వులు విడుదల అయ్యాయి. . జస్టిస్ ఫర్ దిశ వ్యవహారంలో విచారణ వేగవంతం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు అయింది మహబూన్ నగర్ లో ఫస్ట్ ఆడిషనల్ డిస్టిక్ ఎన్ సెషన్స్ జడ్జి ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దిశ హత్యకేసుపై హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసిన విషయ తెలిసిందే. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖలో ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.ఇటీవల ప్రగతి భవన్‌లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ దిశ హత్య విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. వైద్యురాలి హత్య అతి దారుణమైన, అమానుష దుర్ఘటనగా అభివర్ణించారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళలు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాగా, బాధిత వైద్యురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.

Related Posts