YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భ‌ద్ర‌త‌పై జిహెచ్ఎంసి మ‌హిళా ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు

భ‌ద్ర‌త‌పై జిహెచ్ఎంసి మ‌హిళా ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు

భ‌ద్ర‌త‌పై జిహెచ్ఎంసి మ‌హిళా ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు
హైదరాబాద్‌ డిసెంబర్ 4 
 నిత్య‌జీవితంలో ప‌ని ప్ర‌దేశాలు, ప్ర‌యాణం, బ‌స్టాప్‌లు, బ‌స్సులు, ఆటోలు, షాపింగ్ మాల్స్‌, ఇత‌ర ప్ర‌దేశాల్లో ఎదుర‌య్యే వేదింపుల‌ను మౌనంగా భ‌రించ‌వ‌ద్ద‌ని మ‌హిళ‌ల‌కు అడిష‌న‌ల్ డి.సి.పి పూజిత సూచించారు. బుధ‌వారం జిహెచ్ఎంసి కార్యాల‌యంలో మ‌హిళా ఉద్యోగులు త‌మ ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి నిర్వ‌హించిన అవ‌గాహ‌న స‌ద‌స్సులో మాట్లాడారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కై రూపొందించిన ల‌ఘు చిత్రాల ద్వారా వివ‌రించారు. టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ 100కు వెంట‌నే డ‌య‌ల్ చేయాల‌ని తెలిపారు. డ‌య‌ల్ చేసిన ఐదు నిమిషాల్లో ఆ ప్ర‌దేశానికి షీ-టీమ్స్ చేరుకుంటాయ‌ని వివ‌రించారు. మ‌హిళ‌లు, ముఖ్యంగా మ‌హిళా ఉద్యోగుల భ‌ద్ర‌త‌కై 2014 అక్టోబ‌ర్ 14న ముఖ్యమంత్రి కె.సి.ఆర్ షీ-టీమ్స్‌కు అంకురార్ప‌ణ చేసిన‌ట్లు వివ‌రించారు. న‌గ‌రంలో ఉన్న షీ-టీమ్స్ మ‌ఫ్టీలో విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో నిరంత‌రం నిఘావేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించే వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్న‌ట్టు తెలిపారు. మార‌ని వ్య‌క్తుల‌పై కేసులు న‌మోదు చేస్తున్న‌ట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబ‌ర్ 100కు కాల్ చేసిన మ‌హిళ‌ల వివరాలు ర‌హ‌స్యంగా ఉంచుతున్న‌ట్లు తెలిపారు. ఇంట్లో కూడా అబ్బాయిలు, అమ్మాయిల‌ను స‌మానంగా పెంచాల‌ని ఆమె సూచించారు. సామాజిక అంశాల‌పై అబ్బాయిల‌ను కూడా చైత‌న్య‌ప‌ర్చాల‌ని తెలిపారు. ఎదుటి వ్య‌క్తి వేదింపుల‌ను మౌనంగా భ‌రించ‌డం వ‌ల‌న న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిపారు. గృహ హింస‌కు సంబంధించిన వివ‌రాల‌ను కూడా తెలియ‌జేయ‌వ‌చ్చున‌ని తెలిపారు.ఈ సంద‌ర్భంగా జిహెచ్ఎంసి అద‌న‌పు క‌మిష‌న‌ర్ సిక్తాప‌ట్నాయ‌క్‌, విజ‌య‌ల‌క్ష్మిలు మాట్లాడుతూ జిహెచ్ఎంసిలో మ‌హిళ‌ల రక్ష‌ణ‌కై వేదింపుల నివార‌ణ‌కు అద‌న‌పు క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న ఛైర్మ‌న్‌గా  అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీ ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ క‌మిటి రెగ్యుల‌ర్‌గా స‌మీక్షించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Related Posts