YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రాజాసింగ్ కామెంట్స్ పై దుమారం

 రాజాసింగ్ కామెంట్స్ పై దుమారం

 రాజాసింగ్ కామెంట్స్ పై దుమారం
హైద్రాబాదం, డిసెంబర్ 4, 
తెలంగాణలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్త స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న తనను పార్టీ అసలు పట్టించుకోవడమే లేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం (డిసెంబర్ 3) ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీలో ఎదగడం కొందరు బీజేపీ నాయకులకు నచ్చట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవిలో ఉండడం వల్లే డాక్టర్ కె.లక్ష్మణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్లే సొంత నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టలేకపోయారని వివరించారు.మరోవైపు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అసలు ప్రోటోకాలే పాటించటం లేదని రాజాసింగ్ విమర్శించారు. తన నియోజకవర్గమైన గోషామహల్‌ పర్యటనకు వస్తే తనకు సమాచారమే ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్‌ పాటించేవారని గుర్తు చేశారు. బీజేపీ అధ్యక్ష పదవిపై తనకు ఆశ లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. ఎంపీ బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణలో ఆ పదవి ఎవరికి ఇచ్చినా మంచిదేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు అంశానికి సంబంధించిన వార్తలపై ఆయణ్ని ప్రశ్నించగా ఈవిధంగా స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అర డజను మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, డి అరవింద్, బండి సంజయ్, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు పేర్లను ఈ పదవికి అధిష్టానం పరిశీలిస్తోంది.‘బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌తో పాటు డీకే అరుణ వంటి వారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హులే. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ ఆర్థికంగా కూడా శక్తిమంతుడు. నా విషయానికి వస్తే.. హిందూ ధర్మం, గో సంరక్షణే నాకు సంతృప్తి నిచ్చే విషయాలు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాకు రాజకీయ మార్గదర్శి లాంటి వారు. అధ్యక్ష పదవిపై నాకు ఏనాడూ ఆశ లేదు. తెలంగాణ బీజేపీలోని అగ్ర నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో నా ఓటమి కోసం పని చేస్తే.. నా నియోజకవర్గ కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి నన్ను గెలిపించుకున్నారు’ అని రాజా సింగ్‌ అన్నారు.

Related Posts