YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 విలీనం చేసేయండి : జీవీఎల్

 విలీనం చేసేయండి : జీవీఎల్

 విలీనం చేసేయండి : జీవీఎల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 4, 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. బీజేపీతోనే ఉన్నానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో మళ్లీ జనసేనాని చూపు మారిందనే చర్చ జరుగుతోది. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బీజేపీ విధానాలు నచ్చి తమతో కలిసి పనిచేయాలనుకుంటే తాము సిద్ధమన్నారు.. కాకపోతే ఇది పొత్తులకు సరైన సమయం కాదన్నారు. తమ భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్‌ను.. వేరేవారిపైకి సంధించాలనుకుంటే పొరపాటేనని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల ముందే జనసేనని బీజేపీలో విలీనం చేయాలని కోరామని.. జనసేనాని అంగీకరించ లేదన్నారు జీవీఎల్. కేంద్ర పెద్దలంటే గౌరవమని పవన్ కళ్యాణ్‌తో పాటూ టీడీపీ నేతలు చెబుతున్నారని.. తమతో కలిసి పనిచేయాలని భావిస్తే.. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని.. ఈ ప్రక్రియకు సంబంధించి తన వంతు సహకారం అందిస్తానన్నారు.ఇటు పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ రాజకీయ నేతలు అంటూ చేసిన వ్యాఖ్యల్ని జీవీఎల్ ఖండించారు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమని పవన్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హిందువులే మత ఘర్షణలకు కారణం అనడం రాజకీయ దురుద్దేశమేన్న ఆయన.. మతపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వొద్దనేది బీజేపీ సిద్ధాంతమని చెప్పారు.

Related Posts