YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సిటీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

సిటీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

సిటీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
హైద్రాబాద్, డిసెంబర్ 5,
మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒకవైపు ఇప్పటికే చలికాలం ప్రారంభం కావటం, దానికి తూఫాన్ తోడు కావటంతో సాయంత్రం ఐదు గంటల నుంచే నగరంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. అడపాదడపా సన్నగా ముసురు వర్షం కూడా కురవటంతో చలి ప్రభావం పెరిగింది. చీకటి పడిందంటే చాలు, తెల్లవారుఝము ఎనిమిది గంటల వరకు చలి వణికిస్తోంది. శివార్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాత్రి ఎనిమిది గంటలకే చలి మంటలు కాచుకోవటం కన్పిస్తోంది. తెల్లవారుఝము నగరంలోని హుస్సేన్‌సాగర్, ఇందిరాపార్కు, ధుర్గం చెరువు తదితర ప్రాం తాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. ముఖ్యంగా నిత్యం వాహనాల రాకపోకలకు రద్దీగా ఉండే పలు మెయిన్ రోడ్లన్నీ రాత్రి పది గంటల కల్లా నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత సంవత్సరం ఇదే నవంబర్ మాసం చివరి, డిసెంబర్ మొదటి వారం రోజులను గమనిస్తే ఈ సారి రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత సంవత్సరం 2018 నవంబర్ చివరి మూడురోజులు, డిసెంబర్ 1వ తేదీ నుంచి మూడో తేదీ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలను గమనిస్తే చాల తగ్గాయి. గత సంవత్సరం ఇదే రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలుగా నమోదు కాగా, అదే రోజుల్లో ఈ సంవత్సరం గరిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలకు పడిపోయి 26 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రెండు డిగ్రీలు తగ్గి 24 డిగ్రీలుగా నమోదు కావటం చలి తీవ్రతకు కారణమని చెప్పవచ్చు. ఈ నెల 3,4వ తేదీల్లో  నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 26డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో గాలిలో తేమ 47 శాతం మాత్రమే ఉండగా, ఈ సారి గడిచిన మూడురోజులుగా గాలిలో తేమ 82 శాతానికి పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ ప్రారంభంలోని మూడురోజులు గాలులు గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీయగా, ఈ సారి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఈ నెల 1వ తేదీ ఆదివారం రోజున గరిష్ట ఉష్ణోగ్రత 28డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24డిగ్రీలుగా నమోదు కాగా, అది కాస్త మంగళవారం 26 గరిష్ట, 24 కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయింది.

Related Posts