దేశ ఆర్థిక పరిస్థితిపై చిదంబరం ....మోదీ సర్కార్ అసమర్థత వల్లే..
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక స్థితిపై ఎప్పుడూ మౌనంగానే ఉంటున్నారని చిదంబరం వ్యాఖ్యానించారు. ఆ వ్యవహారాలన్నీ మంత్రులకు వదిలేశారన్నారు. ఫలితంగా ఆర్థిక నిపుణులు చెప్పినట్టు దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఒకవేళ జీడీపీ వృద్దిరేటు 5శాతానికి చేరితే మనం అదృష్టవంతులమని చిదంబరం అన్నారు. కానీ సుబ్రహ్మణ్యస్వామి చెప్పే మాటలను కూడా గుర్తెరగాలని సూచించారు. దేశ అసలు జీడీపీ 5శాతం కాదని,1.5శాతం కంటే తక్కువ ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తాను కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక వ్యవహారాల పట్ల తాను చాలా స్పష్టంగా వ్యవహరించేవాడినని చెప్పారు.