YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పెండింగులో ఉన్న బకాయిల బిల్లులు వెంటనే విడుదల చేయాలి

పెండింగులో ఉన్న బకాయిల బిల్లులు వెంటనే విడుదల చేయాలి

పెండింగులో ఉన్న బకాయిల బిల్లులు వెంటనే విడుదల చేయాలి
ఎమ్మిగనూరు డిసెంబర్ 5  
 రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 వేల కోట్ల రూపాయలు పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్,మెస్,కాస్మొటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో బాగంగా ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఎమ్మిగనూరు తాలూకా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం వైఎస్సార్ సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర,  తాలూకా అధ్యక్షుడు సమివుల్ల మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మా ప్రభుత్వమే చదివిస్తుందని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని గాలికి వదిలేసి ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మినహాయించి మిగతా అన్ని రంగాలలో తమకు అవసరం అనుకున్న వారికి ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అందుకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కు ఫీజురియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్,మెస్,కాస్మొటిక్ బిల్లులు విడుదల చేయక పోవడమేనన్నారు.ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్ధుల నుండి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వానికి విద్యార్థుల ఉసురు  కొట్టుకుంటుందని వారన్నారు. అంతే కాకుండా మెస్,కాస్మొటిక్ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల హాస్టల్ వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజురియంబేర్స్మెంట్,స్కాలర్షిప్లు,మెస్ కాస్మొటిక్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.లేని పక్షంలో విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ తాలూకా నాయకులు పౌలు,నరసింహుడు, రాజు,మహేష్,రవి,మల్లీ,సురేష్, బాషా,రవి,వెంకటేష్ లు పాల్గొన్నారు

Related Posts