ఎల్ఆర్ ఎస్ కు ఈనెల 31 గడువు
హైదరాబాద్ డిసెంబర్ 5
గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ మెయింటనెన్స్ పనులు ప్రారంభం అయ్యాయి. ఎల్ ఆర్ ఎస్ 28 వేల అప్లికేషన్లు వచ్చాయి. అప్లై చేసుకునేందుకు డిశెంబర్ 31 చివరి తేదని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. మధ్యవర్తులుగా ఉన్న వారితో త్వరలో సమావేశం వుంటుంది. అసలు దరఖాస్తుదారులకే సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరిన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జోన్ లో ఒక స్కై వాక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అయన అన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలు 13 వేల మెట్రిక్ టన్నులు కలెక్ట్ చేశాం. రెండు, మూడు నెలల్లో ట్రాన్స్ఫర్ స్టేషన్ ల సంఖ్యను 17 నుంచి 60 కి పెంచనున్నాం. భవిష్యత్తులో 300 వరకు పెంచుతామని అయన అన్నారు.