YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

దిశ కేసు దర్యాప్తుకు ఏడు బృందాలు

దిశ కేసు దర్యాప్తుకు ఏడు బృందాలు

దిశ కేసు దర్యాప్తుకు ఏడు బృందాలు
సైబరాబాద్ డిసెంబర్ 5 
దిశ హత్య కేసు లో మొత్తం ఏడు  బృందాలు ఏర్పాటు చేసారు.  ఒక్కో బృందం లో ఏడుగురు పోలీసులు వుంటారు. దిశ కేసు లో మొత్తం 50  మంది పోలీసులు విచారణ లో పాల్గోంటున్నారు. కమిషనర్  నుంచి కానిస్టేబుళ్ల వరకు ఇన్వెస్టిగేషన్ లో పాలు పంచుకుంటారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ గురువారం తెలిపారు. ఈ ఏడు బృందాలు ఛార్జ్ షీట్ దాఖలు వరకు పని చేస్తాయి. మరో వైపు దిశ హత్య కేసు లో  నిందితుల విచారణ కు డీసీపీ ప్రకాష్ రెడ్డి  నేతృత్వం లో ఒక బృందం విచారణ జరుపుతుంది. సాక్ష్యాల సేకరణకు మరో బృందం ఏర్పాటు అయిందనిఅయన అన్నారు. ఫోరెన్సిక్ , డీఎన్ ఏ  ల పరిశీలనకు ఒక బృందం,   లీగల్ ప్రొసీడింగ్స్ కు మరో బృందం ఏర్పాటు చేసారు. కేసులో ప్రధానం గా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కోసం మరొక టీమ్ ఏర్పాటు అయిందని అయన అన్నారు. కేసు లో  సీసీ కెమెరాల వీడియో అనాలసిస్ ,టెక్నీకల్ ఎవిడెన్స్  ఎనాలిసిస్ కోసం ఒక బృందం, సీన్ టూ సీన్ అనాలసిస్ , క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ కోసం మరో బృందం ఏర్పాటు చేసారు. నెల రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని  సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసారు.

Related Posts