YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆస్తి-పాస్తులు తెలంగాణ

ఆత్మగౌరవ భవనాల స్థలాలను పరిశీలించిన మంత్రులు

ఆత్మగౌరవ భవనాల స్థలాలను పరిశీలించిన మంత్రులు

ఆత్మగౌరవ భవనాల స్థలాలను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్ డిసెంబర్ 5
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి సి కులాలకు రంగా రెడ్డి జిల్లాలోని కోకాపేటలో పదమూడు బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన స్థలాలను రాష్ట్ర  మంత్రులు  శ్రీనివాస్ గౌడ్,   గంగుల కమలాకర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తరువాత మంత్రి  గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్  వెనుకబడిన కులాల, వర్గాలు గొప్ప స్థాయికి చేరుకోవాలని హైదరాబాద్ నగరంలోని కోక పేట లో ఆత్మగౌరవ నాలకు స్థలాలను కేటాయించారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బీసీలకు  80 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణాలకు 80 కోట్ల రూపాయలను కేటాయించారని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఈ భవనాలను త్వరగా కట్టేందుకు అని సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కేసీఆర్, హెచ్ ఎండీయే పరిధిలోని సుమారు రెండు, మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమి ని బీసీ కులాలకు ఆత్మగౌరవం భవనాల కోసం స్థలాలను కేటాయించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు 80 శాతం ఉన్న బీసీ వర్గాలను ఓటు బ్యాంకు కోసం చూశారు. ఏ ఒక్క కులానికి గజం భూమి ని కేటాయించలేదు. బీసీలకు గత ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే కానీ ఏమి చేసింది లేదని అన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేసే నాయకులను తయారు చేసిన ఈ వర్గాలకు చదువుకోవడం కోసం ఏలాంటి ఏర్పాట్లు గతంలో చేయలేదు. 13 కుల సంఘాలకు కోకపేట లో సుమారు 40 ఎకరాల విలువైన భూమిని కేటాహించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు. భవనాల నిర్మాణం కోసం త్వరలోనే అన్ని కుల సంఘాలకు అందజేస్తాము. భవనాల నిర్మాణంలో కుల సంఘాల పెద్దలను, అధికారులను భాగస్వాములను చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు. మంత్రి కేటీఆర్  భవనాలకు కావలసిన ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. ఈ ఆత్మ గౌరవ భవనాల ద్వారా వెనుకబడిన వర్గాలకు కావలసిన అనేక అవసరాలను పెళ్లి వేదిక కాని, వృత్తి నైపుణ్య శిక్షణ ట్రైనింగ్ సెంటర్, విద్యార్థుల వసతి గృహం లతో పాటు  హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ భవన్ లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్,  జలవనరుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్  ప్రకాష్, బీసీ  సంక్షేమ శాఖ కమిషనర్  అనిత రాజేంద్రన్, అదనపు కార్యదర్శి  సైదా, రెవెన్యూ శాఖ అధికారులు చంద్రకళ, పురపాలక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts