ఉన్నావో బాధితురాలు సజీవ దహనం
లక్నో, డిసెంబర్ 5,
అత్యాచార బాధితురాలు తమపై కేసు పెట్టిందన్న అక్కసుతో నిందితులు ఆమెకు నిప్పంటించి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావోలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో ఉన్నావో జిల్లాలోని తన తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న క్రమంలో బాధిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నారు. నిందితుడు ఇటీవలే బెయిల్‌పై విడుదలై వచ్చాడ కేసు విచారణ నిమిత్తం బాధితురాలు గురువారం కోర్టుకు వెళ్తుండగా నిందితులు అపహరించారు. గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న మెను అపహరించిన నిందితులు ఊరి చివరకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. బాధిత మహిళ శరీరం 90 శాతం మేర కాలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుతవ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించారు.బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింద్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడు శివమ్ త్రివేది కూడా ఉన్నట్టు తెలిపారు. అత్యాచార నిందితుల్లో ఒకరు సింద్‌పూర్ గ్రామ సర్పంచ్ కొడుకని, అతడిపై బాధితురాలు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రియాంక.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ‘నిన్న కేంద్ర హోం మంత్రి, యూపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గురించి అబద్దం చెప్పారు. రోజూ ఇలాంటి సంఘటనలు చూడటం ఆగ్రహం కలిగిస్తోంది.. బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని తప్పుడు ప్రచారం ఆపాలి’ అని ప్రియాంక మండిపడ్డారు.