YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఆ నలుగురిని కాల్చి చంపేశారు

ఆ నలుగురిని కాల్చి చంపేశారు

ఆ నలుగురిని కాల్చి చంపేశారు
హైద్రాబాద్, డిసెంబర్ 6
దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిసింది. షాద్ నగర్ వద్ద పోలీసులు కళ్లుగప్పి పారిపోవడానికి ప్రయత్నించిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయడానికి నిందితులను షాద్ నగర్ లోని సంఘటన స్థలికి పోలీసులు విచారణలో భాగంగా తీసుకువచ్చారు. అయితే నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్న కేశవులు పోలీసు కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిసింది. నలుగురు నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశను షాద్ నగర్ ప్రాంతంలోనే నిందితులు కిడ్నాప్, అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. గత నెల 27వ తేదీన దిశ హత్య జరిగిన సంగతి తెలిసిందే. దిశ హత్య కేసులో ఏడు పోలీసు ప్రత్యేక బృందాలను నియమించింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనలో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. దిశను సజీవదహనం చేసిన చోటే నిందితులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. అయి యితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఎన్‌కౌంటర్‌కు గల కారణాలు పోలీసులు గోప్యంగా ఉంచారు.అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్న కేశవులను చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా తరలించారు. తొలుత తొండపల్లి టోల్ సమీపంలోని ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం చేయాలనే ఆలోచన ఎవరిది? తదితర వివరాలను సేకరించారు.అనంతరం అత్యాచారం జరిగిన ప్రదేశానికి సమీపంలో నిందితులు పాతపెట్టిన దిశ మొబైల్‌ను వారితోనే తీయించారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అంతకు ముందు దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఇందుకోసం నిపుణులతో కూడిన క్లూస్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. నిందితులను అరెస్ట్‌ చేసిన సమయంలోనే పలు ఆధారాల్ని సేకరించినా.. కోర్టులో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాల్ని మలివిడతలో క్లూస్‌ నిపుణులు సేకరించారు.ఈక్రమంలో శంషాబాద్‌ తొండుపల్లి, షాద్‌నగర్‌ చటాన్‌పల్లిల్లోని సంఘటన స్థలాల్లో గురువారం క్షుణ్నంగా తనిఖీలు చేశారు. షాద్‌నగర్‌ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగలిగే ‘సూపర్‌లైట్‌’ పరికరాన్ని వినియోగించి ఆధారాల్ని సేకరించారు.

Related Posts