సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్ కౌంటర్
హైద్రాబాద్, డిసెంబర్ 6
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితుల్ని కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. గురువారం అర్థరాత్రి దాటాక జైలు నుంచి వీరిని స్పాట్‌కు తీసుకెళ్లారు.పోలీసులు క్రైమ్ సీన్‌లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో నిందితుల్ని తొండుపల్లి టోల్‌గేట్ దగ్గరకు తీసుకెళ్లారు..అక్కడి నుంచి దిశను కిరాతకంగా పెట్రోల్ పోసి తగులబెట్టిన చటాన్‌పల్లి దగ్గర స్పాట్ వద్దకు వెళ్లారు. చటాన్ పల్లి దగ్గర ఘటన జరిగిన రోజు ఈ నలుగురు నిందితులు ఏం చేశారు.. ఎవరు ఆమెపై పెట్రోల్ పోశారు.. ఎవరు అగ్గిపెట్టతో మంటను అంటించారు. అక్కడి నుంచి ఎక్కడికి పారిపోయారు వివరాలను పోలీసులు సేకరించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో నలుగురు నిందితులు పోలీసుల్ని తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను అత్యంత పాశవికంగా ఎక్కడైతే చంపారో అదే స్పాట్‌లోనే నలుగురు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. చటాన్‌పల్లి బ్రిడ్జి కింద.. దిశను పెట్రోల్ పోసి కాల్చి సజీవదహనం చేసిన ప్రాంతంలోనే నలుగురు పోలీసులు కాల్పుల్లో చనిపోయారు.శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. నిందితులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. నలుగుర్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.. వారు ప్రతిఘటించడంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. స్పాట్‌కు సీపీ సజ్జనార్ వెళ్లారు.. ఈ ఎన్‌కౌంటర్‌ను ఆయన ధృవీకరించారు.