YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

రాళ్లు రువ్వుతూ.. పారిపోయే క్రమంలో.. 

రాళ్లు రువ్వుతూ.. పారిపోయే క్రమంలో.. 

రాళ్లు రువ్వుతూ.. పారిపోయే క్రమంలో.. 
హైదరాబాద్ డిసెంబర్ 6,
దిశ కేసులో నిందితులైన నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు సంఘటన స్థలమైన చటాన్పల్లికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం తెల్లవారుజామున దిశ నిందితులైన ఏ1ఆరిఫ్, ఏ2జొల్లు శివ, ఏ3జొల్లు నవీన్, ఏ4 చెన్నకేశవులును చటాన్పల్లికి పోలీసు వ్యానులో తీసుకువచ్చారు. దర్యాప్తులో భాగంగానే అసలు సంఘటన జరిగిన స్థలంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయేందుకు యత్నించారని సమాచారం.. దీంతో పోలీసులు కాల్పులు జరిపారని సమాచారం. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. చీకట్లో నిందితులు పారిపోయేందుకు యత్నించారని పోలీసులు పేర్కొంటున్నారు.  నిందితుల్లో ముందు ప్రధాన నిందితుడైన ఆరిఫ్ పోలీసులపై దాడి చేశాడని, దీంతో మిగతా ముగ్గురు కూడా పోలీసులపై తిరగబడ్డారని సమాచారం. నిందితులు పోలీసుల చేతుల్లో ఉన్న తుపాకులను లాక్కోనేందుకు యత్నించగా, వీలుకాక పోవడంతో వారు పోలీసులపై రాళ్ల దాడి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేసారని సమాచారం.. దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారని సమాచారం.. ఈ కాల్పుల్లో నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దిశను దహనం చేసిన సంఘటన స్థలం చేరువలోనే హంతకులు మరణించారు.. దర్యాప్తులో భాగంగా కోర్టు ఆదేశంతో దిశ నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఘటనను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఒక ప్రకటన చేసారు. "నిందితులు మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు ఈ తెల్లవారుజామున షాద్ నగర్, చటాన్ పల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన 3 నుంచి 6 గంటల మధ్య జరిగిందని తెలిపారు. గత నెల 27 రాత్రి వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 10 రోజులకు వారి ఎన్ కౌంటర్ జరిగింది.

Related Posts