YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

మహాలక్ష్మి కి మనదేశంలో  ' కొల్హాపూర్ ' లో మందిరం వుంది

మహాలక్ష్మి కి మనదేశంలో  ' కొల్హాపూర్ ' లో మందిరం వుంది

మహాలక్ష్మి కి మనదేశంలో  ' కొల్హాపూర్ ' లో మందిరం వుంది

. మహారాష్ట్ర లో సతారా జిల్లాలో వుంది యీ కొల్హాపూర్ .  హైదరాబాదు నుంచి సుమారు 585 కిలోమీటర్లు . రైలు సదుపాయం , బస్సు సదుపాయం కూడా వుంది . హైదరాబాదు నుంచి NH - 50 మీద ప్రయాణంచి కొల్హాపూర్ చేరుకోవచ్చు . పూనా నుంచి సుమారు 230 కిలోమీటర్లు , యిక్కడనుంచి కూడా రైలు , బస్సు , టాక్సీ సదుపాయాలు వున్నాయి . బోంబె బెంగుళూరు హైవే మీద ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది . 50 , 60 కిలోమీటర్లు సహ్యాద్రి పర్వతాలపై సాగుతుంది ప్రయాణం , యెండాకాలంలో తప్ప మిగతా కాలాలలో చల్లగా కొండలపైనుంచి ప్రవహించే జలపాతాలను చూస్తూ సాగే ప్రయాణం మరువలేనిది . పూనా నుంచి వెళ్లేవారికి సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణానంతరం వచ్చే ' నారాయణ గావ్ ' లో వున్న వేంకటేశ్వర మందిరం ప్రత్యేక ఆకర్షణ . ముందు వేంకటేశ్వర దర్శనం చేసుకొనితరవాత కొల్హాపూరు వెళుతూ వుంటాం . ఈ మందిరం ఓ చిన్న పర్వతం పైన నిజకంపెనీ వారు నిర్మించి నడుపుతున్న మందిరం . ఇక్కడిపూజారులు కూడా తెలుగు వారు కావడం విశేషం . ఈ మందిరం తిరుమల వేంకటేశ్వర మందిరాన్ని తలపింపజేస్తూ వుంటుంది . ఈ మందిర విశేషాలు మరోమారు చెప్పుకుందాం .     కొల్హాపూరు బస్సుస్టాండుకు 5 నిముషాల నడక దూరంలో వుంటుంది మందిరం . కొల్హాపూరు పట్టణం పంచగంగ అని పిలువబడే పవిత్ర నదీతీరాన వుంది . మందిరం చుట్టూరా బురుజులతో కోటగోడ ఆకారంలో కట్టి వుంటుంది . కోటద్వారం దాటగానే కుడివైపున వుంటుంది మందిరం పాత రాతి కట్టడం అని చూడగానే తెలిసిపోతుంది . మందిరం 7వ శతాబ్దానికి చెందింది కాగా అమ్మవారి విగ్రహం సుమారు 6 లేక 5 వేల సంవత్సరాలకు పార్వందిగా గుర్తించేరు . బయట హోమాలు అవి జరుగుతూ పెద్ద మంటపం , లోపల గర్భగుడిలో అమ్మవారు . అమ్మవారి విగ్రహం 40 కిలోల విలువైన రాతితో చేసిన విగ్రహం , అయితే యీ రాయ యేమిటి అనేది తెలియరాలేదు కాని నవరత్నాలలో ఒకటి అని మాత్రం అంటారు . పెద్ద రాతి అరుగు మీద వుంటుంది అమ్మవారి విగ్రహం . చక్కగా పట్టుచీర కట్టి సర్వాంలంకారాలతో కళకళ లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ వుంటుంది అమ్మవారు . పూర్వం యీ పట్టణం కరవీరపురం గా ప్రసిధ్ద పొందింది . అందుకే యీమెని కరవీరపురనివాసిని , అంబామాయి అని కూడా వ్యవహరిస్తూ వుంటారు . 
గర్భగుడిలో లోపల అమ్మవారి ముఖ్య విగ్రహానికి ముందు యెడమ వైపున పార్వతీదేవి విగ్రహం వుంటుంది , యిక్కడ అమ్మవారికి చీర , రవికల బట్టతో పాటు పసుపుకుంకుమ గాజులు మొదలయినవి సమర్పిస్తూ వుంటారు . మహాలక్ష్మి దర్శనానంతరం బయటకు వెళ్లేదారిలో సరస్వతి విగ్రహం కనువిందు చేస్తుంది . అమ్మవారి విగ్రహం సుమారు మూడడుగులు వుంటుంది . గోడకు రాతి శ్రీచక్రం , విగ్రహానికి వెనుకగా ఆమెవాహనమైన సింహం , కిరీటంగా వేయితలల శేషనాగు దానిపైన శివలింగం వుంటాయి . నాలుగు చేతులలో గద , మ్హలుంగఫలం , ఢాలు , పాత్ర వుంటాయి . అంటే యిక్కడ గర్భగుడిలో ముగ్గురమ్మలు కొలువై వున్నారు . యీ ముగ్గురినీ దర్శించుకొని బయటకు వచ్చేక మందిర ప్రాంగణం లో వున్న రాధాకృష్ణ , గణేశ , విఠోబా రుక్మిణి విగ్రహాలను , శివుడు , మహిషాసుర మర్ధిని స్థలవృక్షాన్ని దర్శించుకుంటాం . ఇందులో కొన్ని పురాతనమైనవి , కొన్ని చాలా కొత్తవి . 
ఇక్కడ అమ్మవారు పార్వతి లక్ష్మి కలయిక గా కనిపిస్తుంది .స్థలపురాణం పరిశీలనతో అది నిజమే అనిపిస్తుంది . ఇక్కడ అమ్మవారి విగ్రహం పడమర ముఖంగా వుంటుంది , విష్ణుమూర్తికి వైకుంఠం కన్న యీ క్షేత్రం యెంతో ప్రీతికరం . జగదంబ కరవీరపురాన్ని తన అరచేతిలో పెట్టుకొని నాలుగు వైపులా కాపలా కాస్తూ వుంటుందట . అందుకే మహా ప్రళయకాలంలో కూడా యీక్షేత్రం మిగిలి వుంటుందని యీ క్షేత్రాన్ని అవిముక్తక్షేత్రంఅని అంటారు . దర్శనానంతరం ప్రసాద కూపను యిస్తారు , అది తీసుకొని కాస్తదూరంలో వున్న భోజనశాలకు వెళ్లేం . అక్కడ రెండురకాల కూరలు పప్పు , పులుసు , పచ్చడి , పులిహోర , రెండురకాల తీపి పదార్ధాలతో భోజనం చాలా రుచిగా శుచిగా వుంది . అక్కడ యివ్వదల్చుకున్నవారు మందిర్ ట్రస్టువారికి డొనేషన్ యివ్వొచ్చు . దానికి ప్రతిగా లక్ష్మీదేవి డాలరు ప్రసాదం యిస్తారు .ఈ మందిరంలో నిత్యపూజలతో పాటు లక్ష్మివారం , శుక్రవారం పౌర్ణమిలకు విశేషపూజలు జరుగుతాయి . ఈ మందిరంలో జరిగే మరో విశేష వుత్సవం యేమిటంటే కిరణోత్సవం .  అమ్మవారి కి యెదురు వున్న కిటికీలోంచి అస్తమించే సూర్యకిరణాలు అమ్మవారి విగ్రహం మీద పడతాయి . ఇలా యేడాదిలో మూడు మార్లు జరుగుతాయి . ప్రతీ సంవత్సరం మార్చి 21 న తిరిగి సెప్టెంబరు 21 న , రధ సప్తమినాడు , ఫిబ్రవరి 1 న నవంబరు 11 న  జరుగుతాయి . అయితే ఫిబ్రవరి 1 న నవంబరు 11 న అస్తమించే సూర్యుని బంగారు కిరణాలు అమ్మవారి ఛాతీని తాకుతాయి . ఫిబ్రవరి 2 న నవంబరు 12న అమ్మవారి శరీరమంతటా తాకుతాయి సూర్యకిరణాలు . అదే  ఫిబ్రవరి 3 న నవంబరు 13న అమ్మవారి పాదాలపై పడతాయి సూర్యకిరణాలు . ఆ రోజులలో వేలాది భక్తులు వచ్చి ఆ అపురూప సన్నివేశాన్ని దర్శించుకుంటారు . ఆస్థికులు దీనిని అమ్మవారి కృప అని చెప్పుకుంటే నాస్థికులు మందిరనిర్మాణం కావించిన శిల్పి యొక్క పనితనంగా చెప్పుకుంటారు . ఏది యేమైనా ఆ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆదృశ్యం వర్ణనాతీతం అనిమాత్రం చెప్పుకుంటారు . రథసప్తమి నాడు సూర్యకిరణాలు అమ్మవారి శరీమంతటా తాకుతాయి .కొల్హాపూరు మహలక్ష్మి సతీదేవి యొక్క అష్ఠాదశ పీఠాలలో ఒకటిగా చెప్తారు . ఇక్కడ సతీదేవి కన్ను పడిందట , అందుకే అమ్మవారి కళ్లు కాంతులీనుతూ వుంటాయి . అంతే కాకుండా బృగుమహర్షి కోపోద్రేకంతో లక్ష్మీ వాసమైన విష్ణుమూర్తి ఛాతీ యెడమవైపున తన్నటంతో కోపించిన లక్ష్మి భూలోకానికి వచ్చి కరవీర వృక్షాలతో నిండిన యీ అడవిలో తపస్సుచేసుకోసాగింది . చాలాకాలం తపస్సుచేసుకొని కోపం చల్లారేక వైకుంఠానికి వెళ్లగా అక్కడ విష్ణుమూర్తిని కానక వెతుకుతూ భూలోకానికి వస్తుంది అప్పటికే విష్ణుమూర్తి శ్రీనివాసునిగా అవతరించి లక్ష్మీదేవి ఛాయయైన పద్మావతిని పెళ్లాడుతాడు . పద్మావతి తన ఛాయయని యెరుగని లక్ష్మి విష్ణుమూర్తి పై కోపించి తిరిగి కరవీరపురానికి వెడలిపోతుంది , తిరిగి తపస్సు చేసుకుంటుంది . విగ్రహం వలె చలించకుండా తపస్సుచేసుకుంటున్న స్త్రీ లక్ష్మీదేవి అని యెరుగని జనులు ఆమెకు నీడను కల్పిస్తారు , లక్ష్మీదేవి కరవీరపురవాసులకు వారు యెల్లప్పుడూ సిరిసంపదలతో తులతూగుతూ వుంటారనే వరం యిచ్చి శిలగా మారిపోతుంది .
ఈ విషయం లక్ష్మీపురాణం లోనూ , విష్ణు పురాణం లోనూ , వేంకటేశ్వర వైభవంలోనూ ప్రస్తావించేరు . 

Related Posts