YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారసులను గౌరవించాలి 

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారసులను గౌరవించాలి 

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారసులను గౌరవించాలి 
నంద్యాల డిసెంబర్ 6          
 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యులు మంటి ఆశీర్వాద మాదిగ మాట్లాడుతూ . భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్న అంటరానితనం నిర్మూలన కాలేదని, గ్రామాలలో నేటికీ వివక్షత చూపుతూ దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ అవమానించేలా ఆయన విగ్రహం దగ్గర మునిసిపల్ కమిషనర్, అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ  ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం  చాలా బాధ కలిగించింది అని అన్నారు , ప్రభుత్వ అధికారులు దళితుల పట్ల చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసం అని అన్నారు . కర్నూలు జిల్లా ఎం ఎస్ ఎఫ్ అధ్యక్షులు సీఎం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ.ఎస్సీ ఎస్టీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని  కోరారు. దళితులపై జరుగుతున్న అగ్రవర్ణాల దాడులను అరికట్టాలని కోరారు.  జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకు కోటేష్ మాదిగ మాట్లాడుతూ. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన విధంగా హక్కులు అమలు కావడం లేదు అని విచారం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు తమ హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఈశ్వరయ్య, కృష్ణ, వెంకటేశ్వర్లు, లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts