డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ
గుంటూరు డిసెంబర్ 6,
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 4777 డ్వాక్రా సంఘాలకు 100 కోట్ల రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ ఇతర అధికారులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్ధిక సాధికారత పొందాలి. పావలా వడ్డీకి రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డి కె దక్కుతుందని అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ సున్నా వడ్డీకే రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తున్నాం. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తాం. వైఎస్సార్ ఆసరా ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 137కోట్లు రుణమాఫీ చేస్తాం. మహిళకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుందని అన్నారు. నామినేటెడ్ పదవులలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాం. జనవరి 1నాటికి నూతన రేషన్ కార్డులు ఇవ్వనున్నాం.60 ఏళ్లకే పింఛన్లు అందింస్తామని ఆమె అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో6 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నాం. చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ప్రభుత్వం ఫీజ్ చెల్లిస్తుంది. వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు 20 వేలు ఇస్తామని హోంమంత్రి వెల్లడించారు.