YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అన్యాయంగా చంపేశారు: నిందితుల తల్లిదండ్రులు

అన్యాయంగా చంపేశారు: నిందితుల తల్లిదండ్రులు

అన్యాయంగా చంపేశారు: నిందితుల తల్లిదండ్రులు
నారాయణ్ పేట డిసెంబర్ 6 
‘దిశ’ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  దిశ మరణించిన ప్రదేశంలోనే వారిని చంపేసిన వైనంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు సామాన్యులు పోలీస్ చర్యకు మద్దతు ప్రకటించారు. అయితే ఎన్ కౌంటర్ లో మరణించిన మహ్మద్ ఆరిఫ్,  జొల్లు శివ,  నవీన్,   చెన్నకేశవుల కుటుంబాలు మాత్రం అన్యాయంగా చంపేశారని ఆరోపిస్తున్నాయి. తమ బిడ్డలను కావాలనే పోలీసులు హతమార్చారని నిందితుల తల్లిదండ్రులు భోరుమంటున్నారు. తాజాగా తమ కుమారుల ఎన్ కౌంటర్ పై ఆరీఫ్ తల్లి చెన్నకేశవులు తల్లి కన్నీళ్ల పర్యంతం అయ్యారు.తమ కొడుకులను కావాలనే చంపేశారని.. దాన్ని దాచిపెడుతూ ఎన్ కౌంటర్ జరిగిందని అబద్ధాలు ఆడుతున్నారని వాపోయారు. నిందితులకు శిక్షలు వేయడానికి కోర్టులు ఉన్నాయని.. ఇలా పోలీసులే అన్యాయంగా చంపేస్తే న్యాయం ఎక్కడ అని వారు ప్రశ్నించారు.డాక్టర్ దిశకు జరిగిన అన్యాయానికి తమకు కూడా బాధగా ఉందని.. తమ బిడ్డలను కాపాడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని..కానీ శిక్షలు చట్టపరంగా విధించడమే సమంజసమని నిందితుల తల్లులు మీడియాతో చెప్పుకొచ్చారు.

Related Posts