‘స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి. ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లాలి. అక్కడ కబ్జా రాయుళ్లు, లిక్కర్ మాఫియా, బెట్టింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా.. ఇలా ఒక్కటేమిటి ఏ రకం మాఫియా కావాలన్నా ఉన్నాయి. వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు. మాఫియా ఆగడాలను అడ్డుకునే సమర్థుడైన పోలీసు అధికారి రావాలి. ప్రజలకు భయభ్రాంతుల నుంచి విముక్తి కలిగించాలని నేను కోరుకుంటున్నా.’’ అధికార పార్టీలో ఆధిపత్యపోరు మొదలైంది. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు శుక్రవారం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బహిర్గతమైంది. మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి.