YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

చంద్రబాబుతో రాజీకి వెళ్దాం, అమిత్ షాకు తెగేసి చెప్పిన బిజెపి సీనియర్లు !!

చంద్రబాబుతో రాజీకి వెళ్దాం, అమిత్ షాకు తెగేసి చెప్పిన బిజెపి సీనియర్లు !!

తెలుగు దేశం అవిశ్వాసం బిజెపిలో భయం పుట్టిస్తోందా? చంద్రబాబుని అనవసరంగా రెచ్చగోట్టాం అని బిజెపి అధినాయకులు ఆలోచనలో పడ్డారా? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న బిజెపి సీనియర్లు అమిత్ షా మీద గుర్రుగా ఉన్నారా? నువ్వు మోడీ చేసే పనుల వల్ల పార్టి నాశనం అయ్యింది అన్నారా? కాషాయ దళం లో ఏమి జరుగుతుంది? అవిశ్వాసానికి సంబందించిన మీటింగ్ లో బిజెపి సీనియర్లు దేనికి ఫెయిర్ అయ్యారు? పూర్తీ వివరాలు.. బీజేపీలో అంతర్గతంగా లుకలుకలు చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై లెక్కలు తీశారు. దీని ప్రకారం 302 మంది మద్దతు తమకు లభిస్తుందని అంచనాకు వచ్చారు. అంతర్గత వర్గాల కథనం ప్రకారం.

ఎన్డీఏలోని మిత్రపక్షాలు, అన్నాడీఎంకే తదితర పార్టీల సంగతి అటుంచితే తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగితే నరేంద్ర మోడి షా ఒంటెద్దు పోకడలకు  కమలదళం సభ్యులే ఎంతమంది హాజరవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే  ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వైఖరి నచ్చని అనేక మంది సభ్యులు గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రిపురలో బీజేపీ అగ్రనేత ఆడ్వాణీని మోదీ అవమానించిన తీరు చాలా మంది పార్టీ ఎంపీల మనసు గాయపరిచడంతో పాటు ఉత్తర ప్రదేశ్ లో గెలిచే సీట్లు ఓడిపోవడం అద్వానీ గారిని అవమానించిన సంఘటనతో ఒకేసారి ఉత్తరప్రదేశ్ లో భాజపా గ్రాఫ్ పడిపోవడమే మంచి ఉదాహరణ. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు పూర్తి సంఖ్యలో ఎంపీలు రాకపోవడం.. విప్‌ జారీ చేసినా ఉభయసభల్లో ట్రెజరీ బెంచీలు ఖాళీగా కనపడడం పార్టీ అగ్రనేతలను కలవరపరుస్తోంది. సుమారు 50 నుండి 66 మంది ఎంపిలు మోడీ-షా ద్వయం మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరు వోట్ వెయ్యకపోతే మిగతా మిత్రపక్షాలు బిజెపిని అమిత్ షాని లెక్క పెట్టె అవసరమే లేదు. అప్పుడు ఖచ్చితం గా అవిశ్వాసం పెడితే గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి. బిజెపి లోని కొందరు నేతలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అవిశ్వాస పరీక్షకు అంగీకరించడమో లేదా విశ్వాస పరీక్షను ఎదుర్కోవడమో చేయాలనే హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచనకు మోదీ, అమిత్‌ షా అంగీకరించడం లేదని తెలిసింది.బిజెపి సీనియర నాయకులు ముఖ్య కాబినెట్ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ సూచనలు చేసినట్టు గా తెలుస్తుంది.ఒక వేళ అవిశ్వాసం వద్దు అనుకుంటే చంద్రబాబు తో రాజి ఫార్ములాని తీస్కుని వద్దామని అవసరం అయితే రాజ్ నాద్ సింగ్ చంద్రబాబు ని ఒప్పిస్తారని, ఆంద్ర ప్రదేశ్ కి కావలసినవి ఇచ్చి అవిశ్వాసం తీర్మానం ఉపసంహరించు కునేలా చేద్దాం అని కోరారట. అయితే అమిత్ షా దానికి సైతం ససేమిరా అన్నట్టు తెలుస్తుంది. తన కంటే మోడీ నిర్ణయం ముఖ్యమని చెప్పినట్టు గా తెలుస్తుంది. చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి  పలు అంశాలు బయటకు వస్తాయని, అది కర్ణాటక ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకంటే ఈ వారంలోనే పార్లమెంటు ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయడం మంచిదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే తెలుగు దేశం నైతికంగా విజయం సాధించినట్టే అని బిజెపి సీనియర్లు భావిస్తున్నారట. మొత్తానికి తెలుగు దేశం పెట్టిన అవిశ్వాసం మోడీ, అమిత్-షాలకు చుక్కలు చూపిస్తుంది.

Related Posts