వృద్ధురాలు సజీవ దహనం
పిఠాపురం డిసెంబర్ 7
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసెకు నింప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో నిద్రిస్తున్న బులిపే నాగయమ్మ (80) అనే వృద్ధురాలు ఆ మంటల్లో సజీవ దహనం అయ్యింది. తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న వారికి తెలిసే లోపే మంటలు చుట్టుముట్టి పూర్తిగా పూరిల్లు కాలి బూడిదైంది. వృద్ధురాలు నాగయమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అగ్రహారంలో తన కూతురు ఇంటి ముందు ఒక పాకలో ఉంటుంది. సమీపంలో ఉంన్న మనవడు ఆలపాటి వీరబాబు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశాడు అయినా ఫలితం లేకపోయింది. ఫైర్ స్టేషన్ సమాచారం ఇచ్చినప్పటికీ వాళ్ళ వచ్చేలోపే చూస్తుండగానే మంటల్లో ఆమె సజీవదహనం అయిందని నాగయమ్మ కుమార్తె , మనవడు వీరబాబు వాపోతున్నారు. రోజు తమ కళ్ళ ముందు తిరిగే నాగయమ్మ ఇలా సజీవ దహనమై మృతి చెందడం పట్ల అగ్రహారం వాసులు విషాదంలో మునిగిపోయారు.. అగ్నిప్రమాద విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరే ఇతరత్రా కారణాలు ఉన్నాయా అన్న కోణం లో దర్యాప్తు లో తెలనున్నట్లు పట్టణ ఎస్సై నబీ తెలిపారు