YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

దిశకు న్యాయం సరే!..టేకుల లక్ష్మి విషయ ఏమిటి?

దిశకు న్యాయం సరే!..టేకుల లక్ష్మి విషయ ఏమిటి?

దిశకు న్యాయం సరే!..టేకుల లక్ష్మి విషయ ఏమిటి?
హైదరాబాద్ డిసెంబర్ 7 
దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాలేదు. అదే రోజు మారుమూల పల్లెలో దారణంగా అత్యాచారానికి గురైన ఒక వివాహిత మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటనలో న్యాయం జరగలేదు.దళిత బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన ఈ వివాహితను అత్యంత కిరాతకంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు రోడ్ల పైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దిశ హత్య జరిగిన రోజూ ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకూ ప్రభుత్వం ఈ సంఘటనపై స్పందించలేదు.బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదు. నేరం చేసిన ఆ క్రూర మృగాలకు శిక్ష కూడా పడలేదు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్తాన్‌ ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన టేకు లక్ష్మి, గోపి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు.బతుకుదెరువు కోసం జైనూర్‌ మండల కేంద్రంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ వెంట్రుకలకు బుగ్గలు అమ్ముకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. కొద్దిరోజులుగా లింగాపూర్‌ మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ.. బుగ్గలు అమ్ముతున్నారు.ఎప్పటిలాగే భార్యాభర్తలు కలిసి.. ఆదివారం ఉదయమే బుగ్గలు అమ్ముకునేందుకు బయల్దేరారు. భార్యను ఏల్లాపటార్‌లో దింపి.. గోపి ఖానాపూర్‌ వై పు వెళ్లాడు. లక్ష్మిని లింగాపూర్‌ కూడలిలో ఉండమని చెప్పాడు. ఉదయం 11 గంటలకు లింగాపూర్‌కు చేరుకున్న గోపికి లక్ష్మి కనిపించలేదు. మధ్యాహ్నంల వరకూ వేచిచూసినా.. రాకపోవడంతో ఎల్లాపూర్‌కు వెళ్లి వాకబు చేశాడు.గ్రామం దాటి వెళ్లినట్లు కొందరు చెప్పగా.. రామునాయక్‌తండాకు వెళ్లి వాకబు చేశాడు. ఆమెను చూడనేలేదని స్థానికులు చెప్పడంతో తిరిగి లింగాపూర్‌ చేరుకున్నాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో గోపి లింగాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్‌ రంగంలోకి దిగి అదే రాత్రి గాలించినా ప్రయోజనం లేదు.తిరిగి సోమవారం వెదుకుతుండగా.. ఉదయం 10 గంటల సమయంలో రామునాయక్‌తాండ శివారు చెట్లపొదల్లో లక్ష్మి (30) శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉండడం.. అనుమానస్పదస్థితిలో మృతిచెంది ఉండడంతో పోలీసులు జైనూర్‌ సీఐ సురేశ్‌కు సమాచారం అందించారు.ఆయన ఆసిఫాబాద్‌ డీఏస్పీ సత్యనా రాయణతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీస్‌ జాగిలాలతో గాలించారు. లక్ష్మిపై లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్లు అనుమానించారు. ఏల్లపటార్‌ గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఇదీ ఆ నాటి వార్త. ఇప్పటి వరకూ అతీగతీ లేదు. టేకు లక్ష్మి కేసులో న్యాయం జరగాలి. లేకుంటే ఈ అధునాతన పరిశోధనా వ్యవస్థ, పటిష్టమై పోలీసు శాఖకు అర్ధం ఉండదు

Related Posts