అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం.
విజయవాడ డిసెంబర్ 7
డాక్టర్ వై యస్ ఆర్ మెమోరియల్ పదవ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ ను శనివారం నాడు సినీ హీరో సుమన్ , డిప్యూటి సియం పుష్పశ్రీ వాణి , మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. ధైర్యమే మనిషికి చాలా శక్తినిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ , కరాటే వటి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోన్ని సార్లు ఎవరు అండగా ఉండక పోవచ్చు అప్పుడు మన శరీరమే మనకు ఆయుధం కావాలి. ప్రభుత్వంతో మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ను ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ 2020లో కరాటే ఒలంపిక్స్ లోకి వెళ్ళడం సంతోషకరం. దిశ ఘటన తరువాత ఆడపిల్లలు రోడ్డుపైకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. వెంటనే శిక్ష పడినట్లు జరగడం కూడా మంచి పరిణామని అన్నారు. ప్రతి ఆడపిల్లకు సెల్ప్ డిఫెన్స్ చాలా అవసరం. కరాటే అనేది ప్రతి మహిళల నేర్చుకోవాలి. ప్రభుత్వం నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిచే ప్రయత్నం చేస్తామని అన్నారు.